Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాన్స్‌ను పొగిడిన ట్రంప్.. కానీ మద్దతుపై మెలిక

Donald Trump praises JD Vance but remains noncommittal on 2028 support
Advertisement
  • 2028 అధ్యక్ష ఎన్నికలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
  • వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అభ్యర్థిత్వంపై ఇప్పుడే మాట్లాడలేనని వ్యాఖ్య
  • వాన్స్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ప్రశంసలు
  • రిపబ్లికన్ పార్టీలో సమర్థులైన నేతలు చాలామంది ఉన్నారని వెల్లడి
Advertisement
అమెరికాలో 2028 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అధ్యక్ష రేసులో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో 2028 ఎన్నికల అభ్యర్థిత్వంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీ వాన్స్‌ అభ్యర్థిత్వంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన, దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. 2028 ఎన్నికల్లో జేడీ వాన్స్‌కు తన మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు స్పందించారు. "దీనిపై ఇప్పుడే స్పందించడం చాలా తొందరపాటు అవుతుంది. నా స్నేహితుడు వాన్స్‌ అద్భుతంగా పని చేస్తున్నారు" అని ఆయన ప్రశంసించారు. అయితే, అదే సమయంలో రిపబ్లికన్ పార్టీలో నాయకత్వానికి కొదవ లేదని, ఎందరో సమర్థులైన నేతలు పార్టీలో ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అధ్యక్ష పదవికి పోటీ పడగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన నేతలు పార్టీలో అనేకం ఉన్నారని ట్రంప్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఒకవైపు వాన్స్‌ పనితీరును మెచ్చుకుంటూనే, ఆయన అభ్యర్థిత్వంపై స్పష్టమైన మద్దతు ప్రకటించకుండా ట్రంప్ వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యల ద్వారా రిపబ్లికన్ పార్టీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకుంటూనే, అభ్యర్థి ఎంపిక విషయంలో ట్రంప్ ఉత్కంఠను కొనసాగిస్తున్నారు.
Advertisement
Advertisement
Donald Trump
JD Vance
2028 US Presidential Elections
Republican Party
US Politics
Trump JD Vance endorsement

More Telugu News