రూ.253 కోట్లతో అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఫోరెన్సిక్ ల్యాబ్: ఏపీ డీజీపీ

Andhra
Advertisement
  • నేర పరిశోధనకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు వెన్నెముక లాంటివన్న డీజీపీ హరీశ్ గుప్తా
  • పలు కేంద్రాల్లో ల్యాబ్‌లను ఆధునీకరిస్తున్నామని వెల్లడి
  • కీలకమైన కేసుల్లో 13 గంటల్లోనే నివేదికలు అందిస్తున్నామన్న డీజీపీ
Advertisement

రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు పోలీసు నేర పరిశోధనకు వెన్నుముక లాంటివని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఈరోజు రాజమండ్రిలో పర్యటించిన ఆయన... రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రూ.253 కోట్లతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద స్టేట్ లెవల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.


రాష్ట్రవ్యాప్తంగా రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విశాఖ సహా పలు కేంద్రాల్లో ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. డీఎన్ఏ నివేదికలను ప్రస్తుతం 7 రోజుల్లోనే, అత్యంత కీలకమైన కేసుల్లో 13 గంటల్లోనే అందిస్తున్నామని చెప్పారు. అలాగే, సైబర్ నేరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో 'క్లిక్' (CLICK) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజమండ్రి గోదావరి పుష్కరాల సందర్భంగా రద్దీ నివారణకు అధునాతన డ్రోన్లు, రికార్డింగ్ మోడ్‌లోని సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని డీజీపీ పేర్కొన్నారు.

Advertisement

సంబంధిత వార్తలు

Harish Kumar GuptaAmaravati Forensic LabAndhra Pradesh PoliceLargest Forensic Lab in IndiaCybercrime CLICK centersForensic Science Laboratory AP

More Telugu News

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్

30 Oct, 07:35

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38

నాలుగు కుర్చీల హోటల్.. ఇప్పుడు 100కు పైగా బ్రాంచీలు.. 'దిండిగల్‌ తలపాకట్టి బిర్యానీ' విజయగాథ!

29 Oct, 22:27

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు

29 Oct, 22:16

పక్షవాతానికి, విటమిన్ బీ6కి సంబంధం.. యువతకు అలర్ట్!

29 Oct, 22:01

ఆస్తుల సంఖ్య కాదు, ఆదాయమే ముఖ్యం.. మారిన రియల్ ఎస్టేట్ సూత్రం!

29 Oct, 21:46

జాన్వీ గోల్డ్ కలర్ డ్రెస్సు అంత ఖరీదైనదా..?

29 Oct, 21:35

జేఈఈ మెయిన్ 2027: దరఖాస్తుదారులకు ఎన్టీఏ అలర్ట్

29 Oct, 21:19
..More Telugu News