‘ది ప్యారడైజ్‌’కు ట్రైలర్‌ ఉండదు.. ఎందుకో చెప్పిన హీరో నాని

Entertainment
Advertisement
  • సెప్టెంబరు 24న సినిమా విడుదల
  • 18 ఏళ్లలో ఇదే అత్యంత కష్టమైన సినిమా అన్న నాని
  • ‘ది ప్యారడైజ్‌’ తల్లీ కొడుకుల కథ అన్న హీరో
  • సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 49 నిమిషాలు
  • ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత సుధాకర్‌
Advertisement
‘ది ప్యారడైజ్‌’ సినిమాకు ట్రైలర్‌ విడుదల చేయడం లేదని హీరో నాని స్పష్టం చేశారు. సెప్టెంబరు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నాని చెప్పారు.

ట్రైలర్‌ కోసం నాలుగైదు రోజులు కేటాయిస్తే సినిమా పనులపై ప్రభావం పడుతుందని వివరించారు. విడుదలకు సమయం తక్కువగా ఉన్నందున ప్రస్తుతం తమకు సినిమా పూర్తి చేయడమే ముఖ్యమని పేర్కొన్నారు.

శ్రీకాంత్‌ ఓదెలపై ప్రశంసలు
‘దసరా’, ‘ది ప్యారడైజ్‌’ పాటలు ప్రేక్షకులకు నచ్చడానికి సంగీత దర్శకులతో పాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పాత్ర కీలకమని నాని అన్నారు. తనకు కావాల్సిన పాట ఎలా ఉండాలి? ఎవరితో పాడించాలి? ఎలాంటి సాహిత్యం కావాలో? శ్రీకాంత్‌కు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు.

సినిమా కోసం తాను జడలు, చేతిపై టాటూతో కనిపించడంపైనా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని నాని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సోషల్‌ మీడియా ధోరణులకు భయపడకుండా తన ఆలోచనను తెరపై చూపించే వ్యక్తి శ్రీకాంత్‌ అని కొనియాడారు. అతడి పట్టుదల, సినిమా పట్ల ఉన్న ప్రేమ తనకు ఎంతో గర్వంగా అనిపిస్తాయని పేర్కొన్నారు.

అత్యంత కష్టమైన సినిమా
‘ది ప్యారడైజ్‌’ కోసం తన సినీ ప్రయాణంలోనే ఎక్కువగా కష్టపడ్డానని నాని తెలిపారు. టీజర్‌లోని కొన్ని డైలాగ్స్‌ అర్థం కావడం లేదని వచ్చిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు. కథలోని పాత్ర స్వభావం దెబ్బతినకుండా కొన్ని విషయాలను పూర్తిగా వెల్లడించలేమని చెప్పారు.

ఇది పాన్‌ ఇండియా సినిమా కాదని, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. తల్లీ కొడుకుల బంధం చుట్టూ కథ సాగుతుందని, హింసతో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని చెప్పారు.

రన్‌టైమ్‌.. ప్రీమియర్లపై క్లారిటీ
‘ది ప్యారడైజ్‌’ రన్‌టైమ్‌ 2 గంటల 49 నిమిషాలు ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల వెల్లడించారు. ‘ఏష నాగుల’ పాట కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో కీర్తి సురేశ్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారని తెలిపారు. 

సినిమా షూటింగ్‌లో తనతో పాటు పలువురికి గాయాలయ్యాయని నాని చెప్పారు. అయితే అవి సాధారణమేనని పేర్కొన్నారు. మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, ఆయనను దగ్గరగా చూస్తే అభిప్రాయం పూర్తిగా మారుతుందని నాని అన్నారు. సినిమా ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి తెలిపారు. టికెట్‌ ధరల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

NaniThe Paradise movieSrikanth OdelaThe Paradise trailerKeerthy SureshPan India film

More Telugu News

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59
..More Telugu News