ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెండు డీఏలు విడుదల

Andhra
Advertisement
  • సెప్టెంబరు జీతంతో పెంచిన డీఏ
  • 2025 జనవరి నుంచి 1.82 శాతం డీఏ అమలు
  • 2024 జులై నుంచి 2.73 శాతం డీఏ
  • 2028లో 1.82 శాతం డీఏ బకాయిలు
  • పింఛనుదారులకూ ఇదే షెడ్యూల్‌లో బకాయిలు
Advertisement
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.

2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన 20 నెలల బకాయిలను 2028లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. జనవరి, మార్చి, మే, జులై నెలల్లో బకాయిలు జమ చేయనున్నారు.

అలాగే 2024 జులై 1 నుంచి 2.73 శాతం డీఏ చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన 26 నెలల బకాయిలను 2027లో నాలుగు విడతల్లో అందించనున్నారు. ఏప్రిల్‌, జూన్‌, ఆగస్టు, అక్టోబరు నెలల్లో బకాయిలు చెల్లించనున్నారు.

పింఛనుదారులకు కూడా ఇదే విధానంలో డీఏ బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, పింఛనుదారులకు సెప్టెంబరు జీతంతోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందనుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Andhra Pradesh GovernmentAP Employees DADA Hike Andhra PradeshAP Pensioners DAFinance Department APDearness Allowance Release

More Telugu News

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59
..More Telugu News