ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. పాక్‌ ఆయుధ డీలర్‌తో మల్లేశ్‌కు సంబంధాలున్నాయా?

Telangana
Advertisement
  • బొల్లారం ఆర్మీ వెపన్స్‌ చోరీపై దర్యాప్తు వేగం
  • హవాల్దార్‌ మల్లేశ్‌ సోషల్‌ మీడియాపై పోలీసుల దృష్టి
  • పాక్‌ ఆయుధ డీలర్‌ను మల్లేశ్‌ ఫాలో అయినట్లు గుర్తింపు
  • డీలర్‌ ఖాతాలో ఏకే-47, షాట్‌గన్‌ వీడియోలు
  • ఆయుధాల విక్రయ కోణంలోనూ దర్యాప్తు
Advertisement
బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో దర్యాప్తు కొలిక్కి వస్తున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హవాల్దార్‌ మల్లేశ్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ డీలర్లతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మల్లేశ్‌ సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులకు పలు అనుమానాస్పద అంశాలు కనిపించినట్లు సమాచారం. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆయుధ డీలర్‌ను ఫాలో అవుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

సదరు పాక్‌ డీలర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వివిధ రకాల షాట్‌గన్స్‌, ఏకే-47 తుపాకులకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో మల్లేశ్‌ ఆ ఖాతాను ఎందుకు ఫాలో అయ్యాడు? అతడికి ఆ డీలర్‌తో ఏమైనా ప్రత్యక్ష సంబంధాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

దొంగిలించిన సైనిక ఆయుధాలను విదేశీ ఆయుధ డీలర్లకు లేదా అక్రమ ఆయుధ ముఠాలకు విక్రయించాలనే ఉద్దేశంతోనే మల్లేశ్‌ చోరీకి పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అయితే పాక్‌ డీలర్‌తో మల్లేశ్‌కు వాస్తవంగా సంబంధాలు ఉన్నాయా? అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

మల్లేశ్‌ ఉపయోగించిన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటినీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. డిజిటల్‌ ఆధారాలు, ఆన్‌లైన్‌ పరిచయాలు, ఇతర కార్యకలాపాలను విశ్లేషిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఆయుధాల చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? ఏదైనా పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తోందా? అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Havildar MalleshArmy weapons theft BollaramPakistan arms dealer linkMadras Regiment HyderabadArmy weapon robbery caseInstagram social media investigation

More Telugu News

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59
..More Telugu News