మూసీ ప్రాజెక్టుకు ఎన్జీటీలో ఎదురుదెబ్బ.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

Telangana
Advertisement
  • మూసీ ప్రాజెక్టుపై ఎన్జీటీలో కొత్త పిటిషన్‌
  • తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
  • పర్యావరణ అనుమతులపై రిటైర్డ్‌ ఇంజినీర్ల అభ్యంతరాలు
  • 55 కి.మీ.లో 20 కి.మీ. అధ్యయనంపై ప్రశ్నలు
  • ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిర్మాణాలపై అభ్యంతరం
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు మరోసారి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ ఇంజినీర్లు చెన్నైలోని ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్‌ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మూసీ ప్రక్షాళన పనులకు సంబంధించి పర్యావరణ నిబంధనలు, అనుమతుల్లో లోపాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే.. కేవలం 20 కిలోమీటర్ల మేర మాత్రమే అధ్యయనం చేశారని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో మృగవాణి జాతీయ పార్కు కూడా ఉందని తెలిపారు.

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో భారీ నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా రిటైర్డ్‌ ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాణిజ్య సముదాయాల ఏర్పాటుపైనా అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు వాదించారు.

పిటిషన్‌ను పరిశీలించిన ఎన్జీటీ.. ప్రతివాదిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం తన వాదనను కూడా వెల్లడించాల్సి ఉంది.

మూసీ ప్రాజెక్టుపై గతంలోనూ ఎన్జీటీలో న్యాయపరమైన వివాదం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఎన్జీటీ కొట్టివేసింది. ఇప్పుడు మరో పిటిషన్‌ దాఖలు కావడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

రిటైర్డ్‌ ఇంజినీర్లు దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఎన్జీటీ అక్టోబర్‌ 16కు వాయిదా వేసింది. ఆ విచారణలో పిటిషనర్లు లేవనెత్తిన పర్యావరణ అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వివరణలు కీలకం కానున్నాయి. ఇప్పటికే మూసీ ప్రక్షాళనను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎన్జీటీలో తాజా పరిణామం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Musi River ProjectTelangana GovernmentNational Green TribunalNGT NoticeMusi River RejuvenationEnvironmental Clearance

More Telugu News

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59
..More Telugu News