కరెంట్ కోసం నీళ్లివ్వం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టీకరణ

Both States
Advertisement
  • సాగు, తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేఆర్ఎంబీ ఆదేశం
  • ఎల్ నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని తెలుగు రాష్ట్రాలకు సూచన
  • నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు
  • 66:34 నిష్పత్తిలో నీరు కేటాయించాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్
  • 50:50 వాటా కావాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ
Advertisement
ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఉమ్మడి జలాశయాల నుంచి కేవలం విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయడం సాధ్యపడదని స్పష్టం చేసింది. తాగునీటికి ప్రథమ, సాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే మిగిలిన అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని బోర్డు తేల్చి చెప్పింది.

ఈ మేరకు సెప్టెంబరు 4న కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కంబోజ్ నేతృత్వంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశ మినిట్స్‌ను బోర్డు ఇరు రాష్ట్రాలకు పంపింది. 2026 సెప్టెంబరు నుంచి 2027 ఆగస్టు వరకు సాగునీటి కేటాయింపులపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ అంశాన్ని త్వరలో జరగనున్న 21వ కేఆర్ఎంబీ పూర్తిస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.

అయితే, ఈ సమావేశ మినిట్స్‌లో వాస్తవాలను పొందుపరచలేదని, వాటిని తాము అంగీకరించడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ రమేశ్ బాబు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో తాగునీటి సరఫరా, చెరువుల నింపడం కోసం వచ్చే ఏడాది ఆగస్టు వరకు 104 టీఎంసీల నీరు అవసరమని ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ బోర్డుకు విన్నవించారు. సెప్టెంబరు 3 నాటి నీటి నిల్వల ప్రకారం 66:34 నిష్పత్తిలో తమ వాటాకు రావాల్సిన 97.41 టీఎంసీలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

దీనికి భిన్నంగా, నీటి పంపిణీ 50:50 ప్రాతిపదికన జరగాలని తెలంగాణ ఈఎన్‌సీ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్ 12 ప్రకారమే నీటి వినియోగ ప్రాధాన్యతలను నిర్దేశించినట్లు బోర్డు స్పష్టం చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

KRMBKrishna River Management BoardTelangana Andhra Water DisputeSrisailam Nagarjuna Sagar DamsPower Generation Water ReleaseIrrigation Drinking Water Priority

More Telugu News

డీఎస్పీ ఇన్బరాజ్‌గా సూర్య... 'సీన్' గ్లింప్స్ అదిరింది!

27 Oct, 06:28

సీఎస్‌కేలో భారీ ప్రక్షాళన.. కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్, పలువురిపై వేటు!

27 Oct, 06:24

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ.. సన్నని డిజైన్, సరికొత్త ఫీచర్లు!

27 Oct, 06:21

తీవ్ర తుపానుగా బలపడిన 'అర్ణబ్'.. ఏపీ తీరం వైపు వేగంగా కదలిక!

26 Oct, 22:37

చెల్లి, మేనకోడలి విషయంలో జగన్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు: నారా లోకేశ్

26 Oct, 22:29

ప్రయాణం చేసిన వెంటనే ఈవీ స్కూటర్ చార్జింగ్ చేయకూడదా?

26 Oct, 22:12

ఆ ఒక్క పని చేయండి.. 30 సెకన్లలో నిరసన ఆపేస్తాం: ఢిల్లీ వ్యాపారులతో రాహుల్ గాంధీ

26 Oct, 21:59

డెంటల్ ఇంప్లాంట్ల మొండి ఇన్ఫెక్షన్లకు కారణమిదే.. శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

26 Oct, 21:52

రెండేళ్ల వయసులోనే రికార్డు.. తబలాతో అద్భుతం చేసిన చిన్నారి.. వీడియో వైరల్

26 Oct, 21:42

తల్లిదండ్రులారా మీకోసమే.. సురేశ్ రైనా భార్య ప్రియాంక ఏమన్నారంటే?

26 Oct, 21:21

అర్ణబ్ తుపాను ఎఫెక్ట్.. రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు.. జాబితా ఇదిగో!

26 Oct, 21:10

వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' చిత్రానికి సెన్సార్ పనులు పూర్తి

26 Oct, 20:51

హైదరాబాద్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు: ఐదు నెలల తర్వాత నేపాలీ ముఠా అరెస్ట్

26 Oct, 20:44

పోలీసులను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్.. నెగటివ్ ప్రచారంపై ఫిర్యాదు

26 Oct, 19:57

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో ఫైనల్ బిల్లులు!

26 Oct, 19:45
..More Telugu News