గాలి బెయిల్ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ
గాలి జనార్ధన రెడ్డి బెయిల్ కుంభకోణం కేసుపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో గాలి సోమశేఖరరెడ్డి, సురేష్ బాబు, పట్టాభిరామారావును ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అలాగే ఈ కేసులో కీలక నిందితుడైన యాదగిరిని చర్లపల్లి జైలులో విచారించేందుకు అనుమతివ్వాలని ఏసీబీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.