32MP సెల్ఫీ కెమెరా, 7,050mAh బ్యాటరీ.. వివో నుంచి కొత్త ఫోన్
- ప్రారంభ ధర రూ.34,999
- 7,050mAh భారీ బ్యాటరీ
- 6.83 అంగుళాల డిస్‌ప్లే
- 50MP ప్రధాన కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా
- మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్
టీ5 సిరీస్‌లో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 7,050mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
వివో టీ5 5జీ ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 8జీబీ + 128జీబీ మోడల్ రూ.39,999, 8జీబీ + 256జీబీ ధర రూ.44,999. టాప్ వేరియంట్ 12జీబీ + 256జీబీ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.
4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్, మీడియాటెక్ ఎన్‌పీయూ 850 ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి
వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరాకు ఓఐఎస్ సపోర్ట్ ఉంది. దీనికి 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4కే వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు.
7,050mAh బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్6తో వస్తుంది. మూడు ఓఎస్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని వివో తెలిపింది.