భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధర.. రూ.19 వేల వరకు ప్రయోజనం
- ఎస్26 అల్ట్రాపై రూ.15 వేల ధర తగ్గింపు
- 256జీబీ మోడల్ ధర రూ.1,24,999
- 512జీబీ వేరియంట్ ధర రూ.1,44,999
- ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4 వేల క్యాష్‌బ్యాక్
- మొత్తం రూ.19 వేల వరకు ఆదా
శాంసంగ్ ప్రీమియం ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధరను కంపెనీ తగ్గించింది. 12జీబీ ర్యామ్ ఉన్న రెండు వేరియంట్ల ధరల్లో రూ.15 వేల కోత విధించింది. కొత్త ధరలు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.
12జీబీ+256జీబీ మోడల్ ధర ఇప్పుడు రూ.1,24,999. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.1,44,999గా ఉంది. విడుదల సమయంలో వీటి ధరలు వరుసగా రూ.1,39,999, రూ.1,59,999గా ఉన్నాయి. దీంతో రెండు మోడళ్లపై రూ.15 వేల చొప్పున తగ్గింపు లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో అదనపు ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4 వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో 256జీబీ మోడల్‌ను రూ.1,20,999కు కొనొచ్చు. అంటే మొత్తం రూ.19 వేల వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఉంది.
ఈ ఫోన్‌ను శాంసంగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్‌రేట్ లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ చిప్‌సెట్‌ను ఇచ్చారు. కొత్త ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంది. వెనుక 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో నాలుగు కెమెరాలు ఉన్నాయి.