Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాఠశాల విద్యార్థినుల డ్యాన్స్ వీడియోపై 'దంగల్' ఫేమ్ జైరా వసీమ్ అభ్యంతరం.. జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డుకు ప్రశ్నలు

Zaira Wasim objects to schoolgirls dance video and questions Jammu and Kashmir Waqf Board
Advertisement
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక పాఠశాలలో డ్యాన్స్ చేసిన విద్యార్థినులు
  • ఇస్లామిక్ సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్న జైరా వసీమ్
  • వక్ఫ్ బోర్డ్ ఇలాంటి కార్యక్రమాలాను ఎలా ప్రోత్సహిస్తుందని ప్రశ్న
Advertisement

జమ్మూకశ్మీర్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్న పిల్లలు, ముఖ్యంగా విద్యార్థినులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై మాజీ నటి, 'దంగల్' ఫేమ్ జైరా వసీమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో లేదా వారి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.


ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జైరా వసీమ్... ముస్లిం సమాజానికి సేవ చేస్తూ ఇస్లామిక్ విలువలను కాపాడాల్సిన మతపరమైన సంస్థ అయిన వక్ఫ్ బోర్డ్... ఇటువంటి కార్యక్రమాలను ఎలా ప్రోత్సహిస్తుందని నిలదీశారు. బహిరంగ వేడుకల్లో పిల్లలను, ప్రత్యేకించి బాలికలను కేవలం సంబంధం లేని పాటలకు డ్యాన్స్ చేయించడానికే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేలా, ఆలోచింపజేసేలా, సమాజానికి తోడ్పడేలా చేసే అవకాశాలను సంస్థలు కల్పించాలని సూచించారు.


'దంగల్', 'సీక్రెట్ సూపర్‌స్టార్' వంటి చిత్రాల్లో నటించిన జైరా వసీమ్... 2019లో తన మత విశ్వాసాల కోసం నటనా రంగానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Zaira Wasim
Jammu and Kashmir Waqf Board
School girls dance video
Independence Day celebrations
Islamic values
Dangal fame actress

More Telugu News