Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగబాబుకు కేబినెట్ హోదాతో పదవి.. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

Nagababu Konidela gets cabinet rank post Pawan Kalyan thanks Chandrababu Naidu
Advertisement
  • నాగబాబుకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ పదవి
  • కేబినెట్ హోదాతో నియామకం చేపట్టిన ప్రభుత్వం
  • రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యం
  • సోదరుడి నియామకంపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్
Advertisement
జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, నాగబాబు సోదరుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి పక్షాల నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ నియామకంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. నాగబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ, "వికసిత్ ఆంధ్రప్రదేశ్–2047 సాధనలో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం పచ్చదనం సాధించాలనే లక్ష్యాన్ని ఆయన సమర్థమైన నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను" అని తెలిపారు. అటవీ విస్తీర్ణం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నాగబాబు నాయకత్వంలో మరింత వేగవంతంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్తు తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కీలక బాధ్యతలో నాగబాబు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జనసేన నేతకు కేబినెట్ హోదాతో పదవి లభించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
Advertisement
Advertisement
Nagababu Konidela
Pawan Kalyan
Chandrababu Naidu
AP GREEN
Cabinet rank
Andhra Pradesh Government

More Telugu News