టెక్నాలజీ వినియోగం నెక్స్ట్ లెవెల్ బాస్.. చెప్పులను వెతికిపెట్టిన చాట్‌జీపీటీ!
- ఉజ్జయిని ఆలయం వద్ద చెప్పులు పోగొట్టుకున్న యువకుడు
- వాటిని వెతికేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకున్న వైనం
- చెప్పుల స్టాండ్‌ను వీడియో తీసి ఏఐకి అప్‌లోడ్ చేసిన వ్యక్తి
- వీడియోను విశ్లేషించి కరెక్ట్‌గా గుర్తించిన చాట్‌జీపీటీ
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వినూత్న ఘటన
టెక్నాలజీని మనం ఊహించని పనులకు కూడా వాడొచ్చని నిరూపించే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా గోవాకు చెందిన ఓ యువకుడు ఉజ్జయిని మహాకాళ్ ఆలయం వెలుపల పోగొట్టుకున్న తన చెప్పులను కనుగొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనం చాట్‌జీపీటీని ఉపయోగించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. శుభాంగ్ బోర్కర్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. ఉజ్జయిని ఆలయం వెలుపల ఉన్న షూ స్టాండ్‌లో వందలాది చెప్పుల మధ్య తనవి కనుక్కోవడం అతనికి కష్టమైంది. దీంతో అతను వినూత్నంగా ఆలోచించాడు. వెంటనే తన ఫోన్‌తో అక్కడున్న చెప్పుల రాక్స్‌ను వీడియో తీశాడు. తన చెప్పుల ఫొటోను రిఫరెన్స్‌గా ఇస్తూ, తీసిన వీడియోను చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేశాడు.
ఆ ఫొటోలు, వీడియోను విశ్లేషించిన చాట్‌జీపీటీ, రాక్ కుడి వైపున మధ్య భాగంలో అతని చెప్పులు ఉన్నాయని కచ్చితమైన లొకేషన్‌ను సూచించింది. శుభాంగ్ అక్కడకు వెళ్లి చూడగా, అవి తన చెప్పులేనని నిర్ధారించుకున్నాడు. ఈ మొత్తం ప్రక్రియను అతను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలాంటి ఒక సాధారణ సమస్యకు టెక్నాలజీని వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికి కూడా ఏఐని వాడొచ్చని తాము ఎప్పుడూ ఆలోచించలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఏఐ ఇమేజ్ అనాలిసిస్ సామర్థ్యాలకు ఒక సరదా నిదర్శనంగా నిలిచింది.