Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెస్టారెంట్‌లో పనీర్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అసలైనదో, నకిలీదో.. ఇలా తెలుసుకోండి!

Ordering Paneer in a restaurant Find out if it is fake or not
Advertisement
  • నిజమైన పనీర్‌ మెత్తగా, కాస్త తేమగా ఉంటుందంటున్న చెఫ్‌లు
  • పాల వాసన, సహజ క్రీమ్‌ రంగు ఉండాలని సూచన
  • రబ్బర్‌లా గట్టిగా ఉంటే జాగ్రత్త పడాలని హెచ్చరిక
  • సోయా, నూనె వాసన వస్తే అనుమానించాలని సూచన
  • ఫోర్క్‌తో నొక్కితే సహజ పనీర్‌ కొద్దిగా విరుగుతుందని వెల్లడి
  • వంటకంలో నీరు ఉందేమో గమనించాలని సూచన
Advertisement
పనీర్‌ అంటే చాలామందికి ఇష్టం. రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు పనీర్‌ బటర్‌ మసాలా, పనీర్‌ టిక్కా లాంటి వంటకాలు ఆర్డర్‌ చేయడం సాధారణమే. అయితే మీరు తింటున్న పనీర్‌ నిజంగా పాలతో తయారైందేనా? లేక నూనెలు, ఇతర పదార్థాలతో తయారు చేసిన నకిలీ పనీర్‌నా? కొన్ని రాష్ట్రాల్లో డెయిరీ ఉత్పత్తుల పేరుతో విక్రయిస్తున్న నాన్‌-స్టాండర్డ్‌ ఉత్పత్తులపై చర్యలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రశ్న ప్రాధాన్యం సంతరించుకుంది. రెస్టారెంట్‌లో పనీర్‌ నాణ్యతను కొన్ని సులభమైన లక్షణాలతో గమనించవచ్చని చెఫ్‌లు, నిపుణులు చెబుతున్నారు.

మెత్తగా.. కాస్త తేమగా..
ప్రముఖ చెఫ్‌ హర్పల్‌ సోఖీ చెప్పిన ప్రకారం.. మంచి పనీర్‌ మెత్తగా, కాస్త తేమగా ఉంటుంది. నోట్లో వేసుకున్నప్పుడు పాల రుచి కనిపిస్తుంది. రబ్బర్‌లా గట్టిగా, అతిగా సాగుతూ ఉండదు. సహజంగా క్రీమ్‌ రంగులో కనిపిస్తుంది. మరీ తెల్లగా, ఒకేలా మెరిసిపోతుంటే అనుమానించాల్సి ఉంటుంది. అయితే వంట విధానం వల్ల పనీర్‌ గట్టిపడే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.

వాసనతోనూ గుర్తించొచ్చు
చెఫ్‌ అమన్‌ కుమార్‌ ఝా కొన్ని లక్షణాలను గమనించాలని సూచిస్తున్నారు. పనీర్‌ నుంచి సోయా లేదా పామాయిల్‌ వాసన రావడం, రుచి వింతగా ఉండటం, రబ్బర్‌లా సాగడం, కత్తితో కోసినప్పుడు పొడిగా మారడం వంటివి నాణ్యతపై అనుమానం కలిగించే అంశాలు. వండుతున్నప్పుడు ఎక్కువ నీరు బయటకు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఫోర్క్‌తో చిన్న పరీక్ష
క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ ప్రాచి మండోలియా సులభమైన పరీక్షను సూచిస్తున్నారు. ఫోర్క్‌తో పనీర్‌ను మెల్లగా నొక్కితే తాజా పనీర్‌ కొద్దిగా విరిగి పొరలుగా కనిపిస్తుంది. రబ్బర్‌లా బౌన్స్‌ అవుతూ, ఎంత నొక్కినా చెక్కుచెదరకుండా ఉంటే అది ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన పనీర్‌ కావచ్చని చెబుతున్నారు.

పనీర్‌ వంటకం ధరను కూడా గమనించాలి. ఇతర రెస్టారెంట్లతో పోలిస్తే బాగా తక్కువ ధరకు పనీర్‌ వంటకాలు లభిస్తే నాణ్యతపై ప్రశ్నించవచ్చు. అయితే తక్కువ ధర ఒక్కటే నకిలీ పనీర్‌కు ఆధారం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Advertisement
Paneer
Fake Paneer
Harpal Sokhi
Food Safety Tips
Paneer Purity Test
Restaurant Food Quality

More Telugu News