ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాలు ఇచ్చేందుకు 75 శాతం కంపెనీలు రెడీ!

Good news for freshers 75 percent companies ready to hire
  • ఫ్రెషర్లను తీసుకునేందుకు 75 శాతం కంపెనీలు సిద్ధం
  • తొలి అర్ధభాగంలో ఇది 73 శాతంగా ఉంది
  • రిటైల్‌, ఈ-కామర్స్‌లో డిమాండ్‌
  • ఐటీలో ఫ్రెషర్‌ నియామక అవకాశాలు 76 శాతానికి తగ్గింది
  • ఏఐ నైపుణ్యాలకు కంపెనీల ప్రాధాన్యం
  • ఏఐ, క్లౌడ్‌ సెక్యూరిటీ స్కిల్స్‌కు డిమాండ్‌
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌. ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్‌ వరకు ఫ్రెషర్లను నియమించుకునేందుకు 75 శాతం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక తెలిపింది. ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ సంఖ్య 73 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది.

రిటైల్‌, ఈ-కామర్స్‌, టెక్నాలజీ స్టార్టప్‌లు, తయారీ రంగాల్లో ఫ్రెషర్లకు డిమాండ్‌ పెరిగింది. ఉద్యోగానికి అవసరమైన ప్రాక్టికల్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీలు చూస్తున్నాయని నివేదిక పేర్కొంది.

అయితే అన్ని రంగాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకా అవకాశం 81 శాతం నుంచి 76 శాతానికి తగ్గింది. కన్సల్టింగ్‌, టెలికాం, మార్కెటింగ్‌, అడ్వర్టైజింగ్‌ రంగాల్లోనూ మూడు శాతం చొప్పున తగ్గింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ రంగాల్లో రెండు శాతం చొప్పున క్షీణత నమోదైంది.

ఏ స్కిల్స్‌ కావాలంటే?
ఫ్రెషర్లను తీసుకునే విషయంలో కంపెనీలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను రోజ్‌ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, కన్సల్టింగ్‌ రంగాల్లో ఏఐపై అవగాహన, సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించే సామర్థ్యం, ప్రాజెక్టులపై పని చేసిన అనుభవానికి ప్రాధాన్యం పెరుగుతోందన్నారు.

నగరాల వారీగా చూస్తే బెంగళూరు 90 శాతంతో ముందుంది. ముంబై 75 శాతం, చెన్నై 71 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వీఎల్‌ఎస్‌ఐ చిప్‌ డిజైన్‌, ఏఐ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ అనలిటిక్స్‌, గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌ వంటి కోర్సులు ఉద్యోగావకాశాలను మెరుగుపరచగలవని నివేదిక పేర్కొంది.
Advertisement
TeamLease EdTech
Freshers Jobs India
Hiring Trends 2024
Shantanu Rooj
Job Opportunities for Freshers
Bengaluru Job Market

More Telugu News