ఇంట్లో ఇద్దరి హత్య.. స్కూల్‌లో మరో ఆరుగురి ప్రాణాలు తీసిన 14 ఏళ్ల థాయ్‌లాండ్ బాలుడు
- ముందుగా తాత, అమ్మమ్మను కాల్చిచంపిన 14 ఏళ్ల విద్యార్థి
- స్కూల్‌లో ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థుల హత్య
- అనంతరం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
- తాతకు చెందిన 9 ఎంఎం పిస్టల్‌తో కాల్పులు
- ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల విద్యార్థి ముందుగా తన తాత, అమ్మమ్మను ఇంట్లో కాల్చిచంపాడు. తర్వాత స్కూల్‌కు వెళ్లి మరో ఆరుగురిని హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన నాన్‌థబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్ స్కూల్‌లో జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ముందుగా ఇంట్లో తన తాత, అమ్మమ్మపై కాల్పులు జరిపాడు. అనంతరం అదే తుపాకీతో స్కూల్‌కు వెళ్లి ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులపై కాల్పులు జరిపి చంపేశాడు. తర్వాత తనపై తాను కాల్పులు జరుపుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
కాల్పులకు ఉపయోగించిన 9 ఎంఎం పిస్టల్ విద్యార్థి తాతదేనని పోలీసులు తెలిపారు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవారని వెల్లడించారు. ఉదయం 10 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఘటన జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిందితుణ్ని గుర్తించేందుకు పోలీసులు స్కూల్ ఆవరణలో గాలింపు చేపట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.