చైనా కంప్యూటర్ 'సూపర్'...!
సాంకేతిక పరంగా అభివృద్ధి చెందే విషయంలో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే చైనా ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌ను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది చైనా. ఈ సూపర్ కంప్యూటర్ ఒక సెకనుకు 33.86 క్వాడ్రిలియన్ లెక్కలను చేయగలదట. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌గా అమెరికాకు చెందిన టైటాన్ సూపర్ కంప్యూటర్‌ను చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు టైటాన్ స్థానాన్ని చైనా కంప్యూటర్ ఆక్రమించింది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 500 సూపర్ కంప్యూటర్లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే 'టాప్500' లో చైనాకు చెందిన తియాన్హే-2 అనే ఈ సూపర్ కంప్యూటర్ అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ తియాన్హే-2 సెకనుకు గరిష్ట స్థాయిలో 54.9 క్వాడ్రిలియన్ లెక్కలను వేస్తుందట. దీన్ని రూపొందించడానికి పదికోట్ల డాలర్లు ఖర్చయ్యాయట. జాతీయ రక్షణ పరిజ్ఞాన విశ్వవిద్యాలయం దీన్ని రూపొందించింది. ఇంతకుముందు తియాన్హే-1 కంప్యూటర్ కూడా 2010 నవంబరు నుండి 2011 జూన్ వరకూ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందింది. దీంతో సూపర్ కంప్యూటర్ల జాబితాలో మొదటిస్థానాన్ని చైనా కైవసం చేసుకుంది. ఇప్పుడు తియాన్హే-2ను రూపొందించి ప్రపంచంలోనే సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన తన స్థానాన్ని మరోసారి స్ధిరపరచుకుంది.