మా జోలికి రావద్దు, మీ పని చూస్కోండి: నితీశ్ కు వెంకయ్య సలహా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా జోలికి రావద్దు, మీ పని చూస్కోండి: నితీశ్ కు వెంకయ్య సలహా

తమ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టొద్దని జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు హితవు పలికారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. చెన్నైలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులు తెగదెంపులు చేసుకోవడం ద్వారా తాము ద్రోహం చేశామని ఆరోపిస్తోన్న బీజేపీ నేతలే వారి అగ్రనేతలకు ద్రోహం చేశారని, పాట్నాలో నేడు నితీశ్ వ్యాఖ్యానించడం పట్ల వెంకయ్య నాయుడు స్పందించారు. తమ పార్టీలో అందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని అంటూ, ఇతరులు తమకు సలహాలు ఇవ్వనవసరంలేదని వెంకయ్య అన్నారు. గోధ్రా అల్లర్ల అనంతరం కూడా మోడీని ఆకాశానికెత్తేసిన నితీశ్ ఇప్పుడిలా వ్యవహరించడం వెనకున్న మతలబేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News