భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం.. రేపు పట్టాలెక్కనున్న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు!

National
Advertisement
  • రేపు హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • జింద్ నుంచి సోనిపట్ మధ్య పరుగులు పెట్టనున్న రైలు
  • గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైలు
Advertisement

భారతీయ రైల్వే రంగంలో సరికొత్త పర్యావరణ హిత విప్లవానికి కౌంట్‌డౌన్ షురూ అయింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ వేదికగా ప్రధాని మోదీ రేపు (జూలై 17) ఈ ప్రతిష్ఠాత్మక రైలుకు పచ్చజెండా ఊపి, జాతికి అంకితం చేయనున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో జర్మనీ, జపాన్, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరబోతోంది.


ఈ తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టనుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు తిరుగుతూ ప్రయాణికులను చేరవేస్తుంది. రూట్ నెంబర్ 74010 గల ఈ రైలు జింద్ నుంచి ఉదయం 7:40 గంటలకు బయలుదేరి, ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో జింద్ సిటీ, పాండు పిండర, లలిత్ ఖేరా, భంబేవా, గోహనాతో సహా మొత్తం 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.


పూర్తిగా 10 కోచ్‌ల (2 డ్రైవింగ్ పవర్ కార్స్, 8 ప్యాసింజర్ కోచ్‌లు) కాన్ఫిగరేషన్‌తో చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనిని డిజైన్ చేశారు. గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల ఆపరేషనల్ వేగంతో ప్రయాణించే ఈ రైలులో ఒకేసారి 2,600 మంది ప్రయాణించవచ్చు.


అసలు హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

ఈ రైలు నడవడానికి సంప్రదాయ డీజిల్ కానీ, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు కానీ అవసరం లేదు. రైలులో అమర్చిన ఫ్యూయల్ సెల్స్ (ఇంధన కణాలు) సహాయంతో ఆన్‌బోర్డ్‌లోనే విద్యుత్ తయారవుతుంది. నిల్వ ఉంచిన హైడ్రోజన్ గ్యాస్, బయటి గాలిలోని ఆక్సిజన్‌తో కెమికల్ రియాక్షన్ జరిపి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది.


ఈ ప్రక్రియలో ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బై-ప్రోడక్ట్స్‌గా బయటకు వస్తాయి. అందువల్ల ఇది 100% పర్యావరణానికి మేలు చేస్తుంది. ఈ రైలు ఇంధన అవసరాల కోసం జింద్‌లో ప్రత్యేకంగా 3,000 కేజీల కెపాసిటీ గల హైడ్రోజన్ జనరేషన్, రీఫ్యూయలింగ్ స్టేషన్‌ను కూడా రైల్వే శాఖ విజయవంతంగా ఏర్పాటు చేసింది.

Advertisement

సంబంధిత వార్తలు

Indian RailwaysIndia first hydrogen trainPM Narendra ModiJind Sonipat hydrogen trainHydrogen fuel cell technologyGreen energy transport

More Telugu News

పార్టీలు కాదు.. పనిచేసే నాయకులకే పట్టం కట్టాలి: బాలకృష్ణ

01 Nov, 10:21

జర్మనీలో హింసాత్మకంగా మారిన జెన్-జీ నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ

01 Nov, 10:12

48 ఏళ్లుగా నీళ్లు తాగని వారెన్ బఫెట్.. దానికి బదులుగా ఆయన ఏం తాగుతారో తెలుసా?

01 Nov, 10:06

ఎన్నికల బరిలో అనూహ్య పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థి

01 Nov, 09:54

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఓటేసిన బాలకృష్ణ, ఇతర నేతలు

01 Nov, 09:47

ఇరాన్‌లో మరిన్ని లక్ష్యాలున్నాయ్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

01 Nov, 09:36

రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ సభ.. ఢిల్లీలో హైఅలర్ట్

01 Nov, 09:23

రాప్తాడు ఘటన: చిన్నారికి సర్జరీ.. విద్యార్థులకు కౌన్సెలింగ్.. రంగంలోకి మంత్రి లోకేశ్

01 Nov, 09:02

వైభవ్‌ను పక్కనపెట్టడం సరికాదు: టీమిండియాపై కైఫ్ విమర్శలు

01 Nov, 08:53

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. తెలంగాణలో గరిష్ఠ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

01 Nov, 08:34

ఢిల్లీ ర్యాలీపై వినూత్న పిలుపు.. నిరసనతో పాటు షాపింగ్ కూడా చేయాలన్న రాహుల్

01 Nov, 08:32

కడప, పులివెందులలో టెన్షన్.. వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య తోపులాట

01 Nov, 08:11

నెట్స్‌లో కోహ్లీకి చుక్కలు.. ఎవరీ అకీబ్ నబీ?

01 Nov, 08:08

ఏపీలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు

01 Nov, 07:59

‘ఇరుముడి’ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

01 Nov, 07:47
..More Telugu News