ముంబైలో క్రిస్టోఫర్ నోలన్.. స్థానిక కేఫ్‌లో చాయ్ తాగిన‌ 'ది ఒడిస్సీ' టీమ్.. ఇదిగో వీడియో!

Entertainment
Advertisement
  • 'ది ఒడిస్సీ' సినిమా ప్రీమియర్ కోసం ముంబైకి వచ్చిన క్రిస్టోఫర్ నోలన్
  • నటులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్‌తో కలిసి సందడి
  • ప్రీమియర్‌కు ముందు స్థానిక కేఫ్‌లో చాయ్, బన్ మస్కా ఆస్వాదించిన టీమ్‌
  • ప్రపంచవ్యాప్తంగా ఈ నెల‌ 17న సినిమా విడుదల
Advertisement
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రమోషన్స్ కోసం ఇండియాలో అడుగుపెట్టారు. నిన్న‌ ముంబైలో జరిగిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్‌కు ఆయనతో పాటు నటులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ హాజరయ్యారు. అయితే, ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ముందు వీరు ముగ్గురూ ముంబైలోని ఒక కేఫ్‌లో ఆగి, సరదాగా చాయ్ తాగుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా తమ సోషల్ మీడియాలో పంచుకుంది. "ది ఒడిస్సీ ముంబై ప్రీమియర్‌కు ముందు చిన్న టీ స్టాప్. పెద్ద రాత్రి ఎదురుచూస్తోంది. కానీ, చాయ్ మొదట!" అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో నోలన్, డామన్, హాలండ్ చాయ్‌తో పాటు బన్ మస్కా, కొన్ని డెజర్ట్‌లను ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు.

హోమర్ రచించిన ఇతిహాసం ఆధారంగా 'ది ఒడిస్సీ' చిత్రాన్ని నోలన్ తెరకెక్కించారు. ఆయన భార్య ఎమ్మా థామస్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో యాన్ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, చార్లీజ్ థెరాన్ వంటి భారీ తారాగణం నటించింది. గతేడాది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'ఓపెన్‌హైమర్' తర్వాత నోలన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి చిత్రంగా రికార్డ్ 
సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. ఈ సినిమా 70ఎంఎం స్క్రీనింగ్ టికెట్లను ఏడాది ముందే, అంటే 2025 జులైలోనే అమ్మకానికి పెట్టడం విశేషం. యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేస్తున్న 'ది ఒడిస్సీ' ఈ నెల‌ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Christopher NolanThe Odyssey MovieMatt DamonTom HollandMumbai PremiereUniversal Pictures India

More Telugu News

ముంచుకొస్తున్న 'మురసు' తుపాను.. నెల్లూరుకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతం

01 Nov, 14:57

రాప్తాడు బాలికకు శస్త్రచికిత్సలు విజయవంతం.. పీఐసీయూకి తరలించారు: నారా లోకేశ్

01 Nov, 14:38

ఇషాన్‌, అయ్యర్‌ మెరుపులు.. కివీస్‌ ముందు 192 పరుగుల లక్ష్యం!

01 Nov, 14:36

దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయిస్తోంది.. రాహుల్‌ గాంధీ ఆరోపణలు

01 Nov, 14:26

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. 23 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

01 Nov, 14:23

పులివెందులలో ఉద్రిక్తత: ఆర్వో కార్యాలయం వద్ద జగన్ ధర్నా

01 Nov, 14:21

రాష్ట్రమంతా ప్రశాంతం.. కడపలో వైసీపీ హింసకు ముందే ప్లాన్ చేసింది: మంత్రి లోకేశ్

01 Nov, 14:05

ఫేక్ జగన్, ఫేక్ షెడ్యూల్.. వైసీపీ ఫేక్ ప్రచారం: బీటెక్ రవి

01 Nov, 13:49

టీడీపీపై నెట్టేందుకే దాడులు.. పులివెందుల అరాచకం వెనుక జగన్ డైరెక్షన్: ఎమ్మెల్సీ వర్ల రామయ్య

01 Nov, 13:35

ఏపీలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్.. పట్టణాల్లో జోరు, నగరాల్లో నీరసం

01 Nov, 13:22

టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా?.. జీర్ణ సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనంటున్న నిపుణులు!

01 Nov, 12:51

ఐదో టీ20లో టాస్ కివీస్‌దే.. జట్టులో కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

01 Nov, 12:39

పులివెందుల ర్యాలీలో ఉద్రిక్తత.. జగన్‌కు ఎదురుపడి నినాదాలు చేసిన దస్తగిరి!

01 Nov, 12:27

'ఆర్‌సీ17' పూజా కార్యక్రమం.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్ చిరంజీవి

01 Nov, 12:13

ట్రై సిరీస్ ఫైనల్లో పాక్ థ్రిల్లింగ్ విన్.. భారత్ 24 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు సమం

01 Nov, 11:56
..More Telugu News