'లెనిన్' రెస్పాన్స్ చూడటానికి.. థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి జైనబ్ రవ్జీ
- నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రం
- రెస్పాన్స్ చూసేందుకు శ్రీరాములు థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి
- ప్రేక్షకుల స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన జైనబ్
- సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన 'లెనిన్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు వస్తున్న స్పందనను ప్రత్యక్షంగా చూసేందుకు అఖిల్ అర్ధాంగి జైనబ్ రవ్జీ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌ను సందర్శించారు.
నగరంలోని ప్రముఖ థియేటర్ అయిన శ్రీరాములులో ఆమె అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. థియేటర్‌కు వచ్చిన జైనబ్‌కు అఖిల్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. థియేటర్లో తన స్నేహితులతో జైనబ్ సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. సినిమా చూసిన అనంతరం 'లెనిన్' చిత్రానికి వస్తున్న ప్రజాదరణ, అఖిల్ నటనకు లభిస్తున్న ప్రశంసలపై ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జైనబ్ థియేటర్లో సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే 'భారతి' పాత్రలో హీరోయిన్గా నటించింది.
శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరి రావు వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఈ చిత్రానికి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ అందించడం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.