ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం
- మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో ఖననం
- ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్రకు 4.3 కోట్ల వరకు జనం హాజరు
- ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోనూ భారీగా పాల్గొన్న ప్రజలు
ఇరాన్ అధినేత అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్ర అనంతరం, మషద్ నగరంలోని పవిత్ర ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఇరాన్, ఇరాక్లలో జరిగిన ఈ అంతిమ యాత్ర కార్యక్రమాలలో సుమారు 4.1 కోట్ల నుంచి 4.3 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని అంచనా.
అంతిమ సంస్కారాలకు ముందు ఖమేనీ భౌతికకాయాన్ని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేయించి, డార్ అల్-ధిక్ర్ ప్రార్థనా మందిరంలో ఖననం చేశారు. పాయంబర్-ఎ-ఆజం ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చివరి వీడ్కోలు కార్యక్రమం జరిగింది. మషద్ నగరంలో జరిగిన అంతిమయాత్రలో వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఊహించని రీతిలో జనం పోటెత్తడంతో సమీప రహదారులపై కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సి వచ్చింది.
ఇరాన్‌కు చెందిన 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' కథనం ప్రకారం టెహ్రాన్, ఖోమ్, నజాఫ్, కర్బలా, మషద్‌లలో జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారి సంఖ్యను రవాణా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, క్రౌడ్-డెన్సిటీ విశ్లేషణల ఆధారంగా అంచనా వేశారు. ఒక్క ఇరాక్‌లోని నజాఫ్, కర్బలాల్లోనే దాదాపు కోటి మంది పాల్గొన్నారని ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు.
గత శుక్రవారం ప్రారంభమైన ఈ నివాళి కార్యక్రమాలలో 45కు పైగా దేశాల ప్రతినిధులు, 90కి పైగా దేశాల నుంచి పండితులు పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్, టర్కీ, నైజీరియా వంటి దేశాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చి నివాళులు అర్పించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్‌పై 40 రోజుల యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉగ్రదాడికి పాల్పడ్డాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ దాడిలోనే ఖమేనీ, ఆయన అల్లుడు, ఒక కుమార్తె, 14 నెలల మనవరాలు, అలాగే నూతన అధినేత అయతొల్లా సయ్యద్ ముజ్తబా ఖమేనీ భార్య కూడా అమరులయ్యారు.