ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు.. ఏపీఎస్డీఎంఏ అలర్ట్
- వాతావరణ మార్పుల ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
- ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు
- పలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు వర్ష ప్రభావం
- ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా రానున్న కొద్దిరోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తన నివేదికలో పేర్కొంది.
ఆదివారం (జూన్ 28) కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు వివరించారు. వర్షాలు, ఈదురు గాలుల సమయంలో ప్రజలు చెట్లు, హోర్డింగ్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.