ఫరీదాబాద్ టూ బెంగళూరు: 15 వేల నుంచి రూ.30 వేలకు పెరిగిన అద్దె భారం!
- బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలపై పోస్ట్ వైరల్
- ఫరీదాబాద్‌లో రూ.16 వేలు ఉన్న 2బీహెచ్‌కే, బెంగళూరులో రూ.45 వేలు
- అద్దెతో సంబంధం లేకుండా ఏకంగా లక్ష రూపాయల సెక్యూరిటీ డిపాజిట్
- ఐటీ రంగం నుంచి డిమాండ్, వలసల కారణంగా పెరుగుతున్న అద్దెలు
ఫరీదాబాద్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అత్యాధునిక వసతులు కలిగిన 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెలకు కేవలం రూ.15,000 నుంచి రూ.16,000 వరకు మాత్రమే చెల్లించేవాడినని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. కానీ, బెంగళూరులో కనీస సౌకర్యాలున్న సాధారణ 2బీహెచ్‌కే ఫ్లాట్లకు సైతం నెలకు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీటికి తోడు, అద్దెతో సంబంధం లేకుండా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఏకంగా రూ.1 లక్ష వరకు చెల్లించాలని యజమానులు కోరుతున్నారని, ఉత్తరాది నగరాల్లో ఒకటి లేదా రెండు నెలల అద్దెను డిపాజిట్‌గా తీసుకునే సంప్రదాయానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందని వివరించాడు.
ఐటీ రంగంలో పెరుగుతున్న డిమాండ్, ఏటా లక్షలాది మంది ఉద్యోగులు నగరానికి వలస రావడం, అలాగే సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించడం వంటి కారణాలతో బెంగళూరులో అద్దెలపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ పరిణామాల వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో ఏటా సగటున 8 శాతం నుంచి 15 శాతం మేర అద్దెలు పెరుగుతూనే ఉన్నాయి.