ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం!
- వన్8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ
- 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు
- టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
ఇక, టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన 9,230 పరుగులకు గుర్తుగా వీటి ధరను రూ. 9,230గా నిర్ణయించారు. అంతేగాక ఈ షూస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం లేదు. వేల రూపాయలు పెట్టి షూస్‌ను ప్రీ-బుక్ చేసుకున్న అభిమానులకే ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. అయినప్పటికీ, అభిమానుల నుంచి ఊహించని స్పందన లభించడం విశేషం.
ఈ అమ్మకాల సునామీ విరాట్ కోహ్లీకి ఉన్న అసాధారణమైన క్రేజ్, బ్రాండ్ వాల్యూకు అద్దం పడుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రీడారంగంలోనే కాకుండా వ్యాపారంలోనూ కోహ్లీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.