జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు
- కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం
- ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందజేత
- ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారం ఇక్కడే విక్రయిస్తామన్న జియోమైసూర్
- స్థానిక యువతకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం
ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న జియోమైసూర్ సంస్థ, ఇక్కడ వెలికితీసిన బంగారాన్ని రాష్ట్రంలోని వ్యాపారులకే విక్రయిస్తామని స్పష్టం చేసింది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ కార్యక్రమానికి ముందు, మైనింగ్ ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేందుకు మహిళలు, యువతకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ కేంద్రాన్ని సీఎం సందర్శించారు. అనంతరం, ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.



