'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్?

Rajamouli on Varanasi sets with MMA fighter who is Yogesh Jadhav
  • రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్స్‌లో కొత్త వ్యక్తి
  • ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్‌తో జక్కన్న
  • భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ ఎంపిక
  • 'వారణాసి' పేరుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం
  • సెట్స్ నుంచి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వరల్డ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ వారణాసి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలలో రాజమౌళి పక్కన 6.5 అడుగులకు పైగా ఎత్తుతో ఉన్న ఓ భారీ కాయుడు కనిపించడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అతడి కంటే ఎత్తుగా కనిపించేందుకు సరదగా రాజమౌళి కుర్చీ ఎక్కి నిలబడడం ఈ ఫొటోల్లో చూడొచ్చు.

ఇంతకీ ఆ ఫొటోల్లో జక్కన్నతో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, భారత్‌కు చెందిన ప్రొఫెషనల్ ఎంఎంఏ (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్ యోగేశ్ జాదవ్. క్రీడా వర్గాల్లో 'ది జెంటిల్ జెయింట్'గా పేరుపొందిన యోగేశ్, బిగ్ బాస్ మరాఠీ వంటి రియాలిటీ షోల ద్వారా కూడా సుపరిచితుడే. మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం రాజమౌళి అతడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

'వారణాసి' సినిమా కోసం కాశీ నగరాన్ని తలపించేలా భారీ సెట్స్‌ను నిర్మించారు. ఈ సెట్స్‌లోనే రాజమౌళి, యోగేశ్ జాదవ్‌తో చర్చిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సినిమాలో అత్యంత శక్తివంతమైన, హై-ఆక్టేన్ ఫైట్ సన్నివేశాలను డిజైన్ చేయడంలో యోగేశ్ పాలుపంచుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
SS Rajamouli
Mahesh Babu
Varanasi Movie
Yogesh Jadhav
SSMB29 Update
MMA Fighter

More Telugu News