కొత్త ఉద్యోగులతో సీఎం విజయ్.. ఫ్యామిలీకి హాయ్, హార్ట్ సింబల్!
- ట్యాంజెడ్కో కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి
- కార్యక్రమంలో ఉద్యోగులతో సరదాగా ముచ్చటించిన ముఖ్యమంత్రి
- కుటుంబ సభ్యులకు హాయ్ చెప్పాలని కోరిన కొత్త ఉద్యోగులు
- ఒకరి ఫ్యామిలీకి 'హాయ్' చెప్పి, మరొకరికి 'హార్ట్' సింబల్ చూపించిన విజయ్
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాష్ట్ర విద్యుత్ శాఖకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి విజయ్ నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఒక నూతన ఉద్యోగి తన కుటుంబ సభ్యులకు 'హాయ్' చెప్పాలని కోరగా, విజయ్ చిరునవ్వుతూ కెమెరా వైపు చూసి అభివాదం చేశారు.
మరొక అభ్యర్థి 'హార్ట్ సింబల్' చూపించమని కోరగా, ఆయన ఆ విన్నపాన్ని కూడా తీర్చారు. దీంతో సభ ప్రాంగణమంతా చప్పట్లు, కేరింతలతో సందడిగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించారు.