ఊరి పేరు ఇంగ్లిష్‌.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం!

English village name all one family rare village in Bihar
  • గ్రామస్థులందరూ ఒకే కుటుంబ వారసులు
  • గ్రామ చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది
  • ఫాలీ సింగ్‌ అనే వ్యక్తికి భూమిని బహుమతిగా ఇచ్చిన బ్రిటిషర్లు
  • అదే భూమిపై గ్రామం ఏర్పాటు
  • ప్రస్తుతం 125 కుటుంబాలు, 600 మంది నివాసం
గ్రామం అంటే అనేక కుటుంబాలు, వేర్వేరు వర్గాల ప్రజలు ఉండటం సహజం. కానీ బీహార్‌లోని ఓ ఊరు మాత్రం ఈ విషయంలో చాలా భిన్నంగా ఉంది. అక్కడ నివసిస్తున్న వారంతా ఒకే వంశానికి చెందినవారు. అదే తూర్పు చంపారన్ జిల్లాలోని ‘ఇంగ్లిష్’ గ్రామం. పేరు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. మొత్తం గ్రామం ఒకే కుటుంబ వారసులతో నిండిపోవడం మరింత ప్రత్యేకతగా మారింది.

బ్రిటిష్ కాలంలో మొదలైన కథ
గ్రామస్థుల కథనం ప్రకారం 18వ శతాబ్దంలో ఫాలీ సింగ్ అనే వ్యక్తి బ్రిటిష్ పాలనలో సుబేదార్‌గా పనిచేశారు. ఓ యుద్ధ విజయానికి గుర్తింపుగా బ్రిటిష్ అధికారులు ఆయనకు కొంత భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆ నేలపైనే ఈ గ్రామం ఏర్పడింది. మొదట ఆయన కుమారుడు మహిపత్ సింగ్ అక్కడ స్థిరపడగా, తరువాత ఇతర కుటుంబ సభ్యులు కూడా చేరడంతో గ్రామం రూపుదిద్దుకుంది. దానికి ‘ఇంగ్లిష్‌’గా నామకరణం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అందరూ ఒకే వంశం
ఫాలీ సింగ్‌కు నలుగురు కుమారులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వారిలో ముగ్గురు కుమారుల వారసులే ప్రస్తుతం గ్రామంలో నివసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 125 ఇళ్లు, వాటిలో దాదాపు 600 మంది ఒకే కుటుంబ వంశానికి చెందినవారు. దీంతో ఈ గ్రామం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

ఇప్పటికీ కొనసాగుతున్న వారసత్వం
బ్రిటిష్ పాలకులు ఫాలీ సింగ్‌కు ‘రాయ్’ అనే బిరుదు కూడా ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వాతంత్ర్యం తర్వాత భూ సంస్కరణలతో కొంత భూమి ఇతరులకు వెళ్లినా గ్రామ చరిత్ర మాత్రం మారలేదు. శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఓ కుటుంబ కథ నేటికీ మొత్తం గ్రామాన్ని ఒకే బంధంతో కట్టిపడేసింది.
Go Back to Shorts
English Village
Bihar
Phali Singh
East Champaran
One family village
Unique Indian villages

More Telugu News