బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్లు ఎంతంటే?
- సమంత ‘మా ఇంటి బంగారం’కు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
- తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్
- నిన్న అత్యధికంగా రూ. 15 కోట్ల కలెక్షన్లు
- త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్లో చేరే అవకాశం
విడుదలైన తొలి రోజైన శుక్రవారం ఈ సినిమా రూ. 13.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండు రోజులు ముగిసేసరికి వసూళ్లు రూ. 28 కోట్లను దాటాయి. ఇక, వీకెండ్లో చివరి రోజైన ఆదివారం నాడు కలెక్షన్లు మరింత పెరిగాయి. ఒక్క ఆదివారమే ఏకంగా రూ. 15 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వసూళ్ల సరళిని బట్టి చూస్తే, ఈ చిత్రం త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫ్యామిలీ క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.