విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన
- విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా
- సీఎంతో స్వయంగా ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ఉత్సాహంగా యోగా సాధన చేశారు. ముఖ్యంగా, బాబా రామ్‌దేవ్ స్వయంగా ముఖ్యమంత్రితో అనులోమ-విలోమ ప్రాణాయామం చేయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం రామ్‌దేవ్ శిష్యులు ప్రదర్శించిన క్లిష్టమైన యోగాసనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ, యోగాను నిత్యజీవితంలో అంతర్భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు తదితర ప్రముఖులు పాల్గొని యోగా సాధన చేశారు. కార్యక్రమ ప్రారంభంలో వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో స్టేడియం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.