మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది?
- మౌనం అంగీకారానికి సంకేతం కాదంటున్న సైకాలజిస్ట్‌లు
- మెజారిటీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు చాలామంది మాట్లాడటానికి భయపడతారు
- ఈ పరిస్థితినే ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ సిద్ధాంతంగా గుర్తింపు
- సోషల్ మీడియా ఈ ధోరణిని మరింత పెంచుతోంది
- భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణం ఉంటేనే మంచి నిర్ణయాలు
మీటింగ్‌లో అందరూ ఒక నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు... కానీ మీకు మాత్రం అది సరైన ఆలోచనలా అనిపించడం లేదు... లోపాలు కనిపిస్తున్నాయి... అయినా నోరు విప్పరు... చివరకు మిగతావారితో కలిసి తల ఊపేస్తారు... తర్వాత మాత్రం ‘అప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది’ అనిపిస్తుంది. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంది. దీనికే మనస్తత్వ శాస్త్రంలో ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ అనే పేరు ఉంది.
కారణం ఇదే
1970లలో జర్మన్ రాజకీయ శాస్త్రవేత్త ఎలిసాబెత్ నొయెల్లే-న్యూమన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మన అభిప్రాయం మెజారిటీకి భిన్నంగా ఉందని అనిపించినప్పుడు చాలామంది మాట్లాడటానికి వెనుకాడతారని ఆమె వివరించారు. కారణం ఒక్కటే. గుంపు నుంచి వేరుపడిపోతామనే భయం.
ఎలా పెరుగుతుంది?
ఒకరు మాట్లాడరు. తర్వాత ఇంకొకరు కూడా మౌనంగా ఉంటారు. ఇలా భిన్న అభిప్రాయాలు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతాయి. ఫలితంగా అందరూ ఒకే అభిప్రాయంలో ఉన్నారనే భ్రమ ఏర్పడుతుంది. నిజానికి గదిలో సగం మందికి వేరే ఆలోచన ఉన్నా ఎవరూ బయటపెట్టకపోతే అది పూర్తిగా మాయమైనట్టే కనిపిస్తుంది.
సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఏ అభిప్రాయానికి ఎక్కువ లైక్‌లు వస్తున్నాయి? ఏ కామెంట్‌పై విమర్శలు వస్తున్నాయి? అనేది క్షణాల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది తమ నిజమైన అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. విమర్శలు, ట్రోలింగ్ భయం కూడా దీనికి కారణంగా మారుతోంది.
దాని వల్ల నష్టం ఏంటి?
ఆఫీసుల్లో తప్పుడు నిర్ణయాలు ప్రశ్నించకపోతే అవి అలాగే అమలవుతాయి. తరగతి గదుల్లో విద్యార్థులు సందేహాలు అడగకుండా మౌనంగా ఉంటారు. స్నేహితుల మధ్య కూడా ఇష్టం లేని నిర్ణయాలకు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఫలితంగా మంచి ఆలోచనలు బయటకు రాకుండా పోతాయి.
భిన్నాభిప్రాయాలకు చోటు
నిపుణుల ప్రకారం అభిప్రాయ భేదాలను శత్రుత్వంగా చూడకుండా స్వాగతించే వాతావరణం అవసరం. భయం లేకుండా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. పురోగతి కూడా అప్పుడే సాధ్యమవుతుంది.