పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్

Bandi Bhagirath granted bail in POCSO case
  • పోక్సో కేసులో నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు 
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భగీరథ్ వ్యవహారం

తెలంగాణలో గత నెల రోజులుగా హాట్ టాపిక్‌గా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భగీరథ్‌కు ఎట్టకేలకు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట లభించింది. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతనికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భగీరథ్‌పై కఠినమైన పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కొడుకు కావడం, పైగా సున్నితమైన కేసు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్.. మే 17న పోలీసుల ముందుకు వచ్చి సరెండర్ అయ్యాడు.


ఆ తర్వాత మేడ్చల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవడంతో నెల రోజులకు పైగా జైల్లోనే గడపాల్సి వచ్చింది. తాజాగా ఇంజినీరింగ్ పరీక్షల నేపథ్యంలో, భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, భగీరథ్ జైలు నుంచి బయటకు రానున్నారు.

Go Back to Shorts
Bandi Bhagirath
Bandi Sanjay son
POCSO case bail
Malkajgiri court
Cherlapally jail release
Telangana political news

More Telugu News