దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా?
- పావురాలపై హార్వర్డ్ అధ్యయనం
- ఎగురుతున్నప్పుడు కళ్లను స్థిరంగా ఉంచుతున్న పావురాలు
- ప్రత్యేక కెమెరాలతో పరిశీలన
- కనుగుడ్లు 70 శాతం వరకు పెద్దవిగా మార్పు
- దిశ, వేగం నిర్ధారణకు ప్రయోజనం
మనకు ఏదైనా వస్తువు కనిపిస్తే కళ్లను అటూ ఇటూ తిప్పి చూస్తాం. జంతువులు, పక్షులు కూడా అలాగే చేస్తాయని అనుకుంటాం. కానీ పావురాల విషయంలో మాత్రం కథ వేరేలా ఉంది. ఎగురుతున్న సమయంలో పావురాలు తమ కళ్లను దాదాపు కదపవని తాజా పరిశోధన వెల్లడించింది.
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం తొమ్మిది పావురాల తలలకు చిన్న కెమెరాలు, అద్దాలతో కూడిన ప్రత్యేక పరికరాలను అమర్చారు. అవి ఎగురుతున్న సమయంలో కళ్ల కదలికలను నమోదు చేశారు. పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
పావురాలు నేలపై ఉన్నప్పుడు చుట్టూ చూడటానికి తలను కదుపుతాయి. అవసరమైతే కళ్లను కూడా కొద్దిగా తిప్పుతాయి. కానీ ఒకసారి గాల్లోకి ఎగిరిన తర్వాత కళ్లను దాదాపు ఒకే స్థితిలో ఉంచేస్తాయి. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే ఎగురుతున్న సమయంలో పావురాల కళ్ల స్థానం దాదాపు ‘లాక్’ అయినట్టే ఉంటుంది. ఒక విమానంలో కెమెరాను గట్టిగా బిగించినట్లుగా అవి స్థిరంగా ఉండిపోతాయి.
అలా ఎందుకు చేస్తాయనే ప్రశ్నకు కూడా పరిశోధకులు సమాధానం కనుగొన్నారు. పావురాలు గాల్లో వేగంగా ప్రయాణిస్తుంటాయి. అప్పుడు కళ్లను ఎక్కువగా కదిపితే దృశ్యాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే కళ్లను స్థిరంగా ఉంచి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత స్పష్టంగా గుర్తించే ప్రయత్నం చేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. పావురాలు ఎగురుతున్నప్పుడు వాటి కనుగుడ్లు దాదాపు 70 శాతం వరకు పెద్దవిగా మారుతున్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కువ వెలుతురు లోపలికి వెళ్లి వేగంగా మారుతున్న దృశ్యాలను మెదడు త్వరగా విశ్లేషించగలదని చెబుతున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కళ్లను స్థిరంగా ఉంచడం వల్ల పావురాలు దిశ తప్పకుండా ప్రయాణించగలుగుతాయి. అలాగే వేగం, ఎత్తు, చుట్టూ ఉన్న వస్తువుల దూరాన్ని మరింత కచ్చితంగా అంచనా వేయగలుగుతాయి.
సాధారణంగా పావురాలు దూర ప్రాంతాల నుంచి కూడా తమ గూటికి చేరుకుంటాయి. ఈ అసాధారణ నావిగేషన్ సామర్థ్యం వెనుక వాటి కళ్ల పనితీరు కూడా ఒక కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పక్షుల ఎగిరే విధానంపై ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో ఇది ఆసక్తికరమైన అధ్యయనంగా నిలిచింది. కంటికి సాధారణంగా కనిపించే పావురాల్లో కూడా ప్రకృతి ఎంత అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందో ఈ పరిశోధన మరోసారి చూపించింది.