ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్

  • హైదరాబాద్‌లో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ
  • ఏపీ లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు
  • వైసీపీ హయాంలో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. సునీల్ అరెస్టుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) మద్యం రవాణా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపిస్తోంది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చారని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.195 కోట్ల మేర గండికొట్టారని ఈడీ అంచనా వేసింది.

Karumuri Sunil
AP Liquor Scam
Enforcement Directorate
Karumuri Nageswara Rao
APSBCL Liquor Tenders

More Telugu News