01 Tue 16:35 ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏదో తెలుసా? తాజాగా విడుదలైన ‘ఐక్యూఎయిర్’ నివేదిక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్థాన్ పీఎం2.5 స్థాయి 67.3 మైక్రోగ్రాములు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 13 రెట్లు అధికం 38.2 మైక్రోగ్రాముల పీఎం2.5తో ఆరో స్థానంలో భారత్
02 Tue 16:29 అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ ఒప్పందంతో బలపడిన గ్లోబల్ సెంటిమెంట్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద ముగిసిన సెన్సెక్స్ కీలకమైన 24,000 స్థాయికి సమీపంలో నిఫ్టీ మరింత బలపడిన రూపాయి.. తగ్గుముఖంలో డాలర్
03 Tue 16:25 సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. ఫ్యాన్ పేజీపై గంగూలీ పోలీస్ కంప్లైంట్ తనపై దుష్ప్రచారం చేస్తున్న ఫేస్‌బుక్ పేజీపై గంగూలీ ఫిర్యాదు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపణ ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగాయని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడి పేజీ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
04 Tue 16:19 జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష వచ్చే నెలలో 'తల్లికి వందనం' పథకం అమలుకు చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులైలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయం వివిధ 'సెట్'లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన ఏపీకి ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
05 Tue 16:11 ట్రంప్‌తో చర్చల కోసం ఇరాన్ వినూత్న వ్యూహం.. ఏం చేసిందంటే..! ట్రంప్‌తో శాంతి చర్చల కోసం సైకాలజిస్టులను నియమించిన ఇరాన్ ట్రంప్ మానసిక ప్రవర్తనను అంచనా వేయడమే లక్ష్యం ఈ వ్యూహం ఫలించిందని.. ట్రంప్ స్పందన మెరుగైందని వెల్లడి నాలుగు నెలల చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం స్విట్జర్లాండ్‌లో జరగనున్న ఒప్పందంపై సంతకాల కార్యక్రమం
06 Tue 15:57 నెలకు రూ.1.44 లక్షల జీతం.. చేతిలో చిల్లిగవ్వ ఉండటంలేదు! నెలకు రూ.1.44 లక్షల జీతం వస్తున్నా డబ్బు మిగలట్లేదన్న టెక్కీ గురుగ్రామ్ టెక్కీ ఆవేదనతో పెట్టిన రెడ్డిట్ పోస్ట్ వైరల్ ప్లాట్ ఈఎంఐ, ఇంటి అద్దెకే భారీగా ఖర్చవుతున్నాయని వెల్లడి
07 Tue 15:51 నీట్ రీ-టెస్ట్: టెలిగ్రామ్‌పై నిషేధం.. వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు? పేపర్ లీక్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న టెలిగ్రామ్ ఛానళ్లు రహస్యంగా ఛానళ్లు నిర్వహించే వెసులుబాటు ఉండటమే కారణం భారీ ఫైళ్లు, పీడీఎఫ్‌లు షేర్ చేసే సౌకర్యం ప్రభుత్వ ఆదేశాల అమలులో వాట్సాప్ కంటే టెలిగ్రామ్ సహకారం తక్కువ
08 Tue 15:46 ఆమె వయసు సగానికి సగం తగ్గింది... ఆరోగ్య రహస్యం ఇదే! నలభై ఏళ్ల వయసులోనూ యవ్వనంగా కనిపిస్తున్న సుష్మిత ప్రసాద్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె బ్యూటీ సీక్రెట్ ఐదు సాధారణ అలవాట్లను మానేయడం వల్లే తన చర్మం మెరుస్తోందని వెల్లడి నూనె పదార్థాలు, చక్కెర, కారం, కెఫిన్‌కు దూరంగా ఉండటమే అసలు రహస్యం శరీరానికి తగినంత నీరు తాగడం కూడా ముఖ్యమని సూచన
09 Tue 15:39 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన వృద్ధ దంపతులు.. చేతిపై పచ్చబొట్టే వారిని కలిపింది.. సినిమాను తలపించే రియల్ స్టోరీ! పెళ్లయిన కొంతకాలానికే దూరమై 48 ఏళ్ల తర్వాత తిరిగి కలిసిన దంపతులు కుటుంబ కలహాలతో విడిపోయి నాగ్పూర్లో స్థిరపడిన భార్య నిర్మలాదేవి చేతిపై ఉన్న పచ్చబొట్టు గుర్తుతో భార్యను గుర్తించిన భర్త లాలన్ మిశ్రా వృద్ధాప్యంలో తిరిగి ఒక్కటైన జంట.. గ్రామస్థుల హర్షం
10 Tue 15:35 భారత్ చాలా ముందుంది.. డిజిటల్ చెల్లింపులకు విదేశీ అమ్మాయి ఫిదా! భారత్ చెల్లింపు వ్యవస్థపై స్లోవేనియా యువతి ప్రశంసలు చిన్న టీ దుకాణాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి చాలా దేశాల కంటే భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ముందుందని వ్యాఖ్య యూపీఐ ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన వ్యవస్థని అభిప్రాయం