అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉపాసన తల్లి
- అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని నియామకం
- వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా డిజిటల్ హెల్త్ విభాగాన్ని వేరుచేస్తున్న అపోలో
- 18-24 నెలల్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అపోలో హెల్త్‌టెక్‌ను లిస్ట్ చేసే ప్రణాళిక
- అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నలుగురు కుమార్తెలు గ్రూప్‌లో కీలక బాధ్యతలు
- ఉపాసనకు శోభన కామినేని తల్లి
దేశంలోని అతిపెద్ద హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ తన వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. అపోలో గ్రూప్ నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న డిజిటల్ హెల్త్, ఫార్మసీ విభాగం 'అపోలో హెల్త్‌టెక్' ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నియామకంతో కంపెనీ తన డిజిటల్ విభాగం విస్తరణ, ఐపీఓ ప్రణాళికలను వేగవంతం చేసినట్లయింది. నిన్న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని సంస్థ సమర్పించింది.
అపోలో హాస్పిటల్స్ తన డిజిటల్ హెల్త్, ఫార్మసీ వ్యాపారాలను వేరుచేసి 'అపోలో హెల్త్‌టెక్' పేరుతో ఒక ప్రత్యేక సంస్థగా తీర్చిదిద్దుతోంది. రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఈ కొత్త సంస్థను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఓమ్ని-ఛానెల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, టెలీహెల్త్ సేవలు వంటివి ఈ కొత్త సంస్థ పరిధిలోకి వస్తాయి. లిస్టింగ్ నాటికి అపోలో హెల్త్‌టెక్ ద్వారా ఏటా రూ. 25 వేల కోట్ల ఆదాయం సాధించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో శోభన కామినేని తదుపరి వృద్ధి దశకు నాయకత్వం వహిస్తారని అపోలో యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె నియామకానికి వాటాదారులు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
నలుగురు కుమార్తెల చేతిలో కీలక బాధ్యతలు
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి నలుగురు కుమార్తెలు కాగా, వారందరూ గ్రూప్‌లో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శోభన కామినేని, ప్రతాప్ రెడ్డికి మూడో కుమార్తె. ఈమె ప్రముఖ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేనికి తల్లి. ప్రతాప్ రెడ్డి పెద్ద కుమార్తె డాక్టర్ ప్రీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, రెండో కుమార్తె సునీతా రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, చిన్న కుమార్తె డాక్టర్ సంగీతా రెడ్డి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గ్రూప్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు.
తర్వాతి తరం కూడా అపోలో సేవల్లో భాగస్వామ్యమవుతోంది. శోభన కామినేని కుమార్తె ఉపాసన కామినేని, అపోలో హాస్పిటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఆమె 'URLife' అనే వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించి, దానికి ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.