Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎడారికి వెళ్లినా మీటింగులు తప్పవా?.. సహారాలో ల్యాప్‌టాప్‌తో వ్యక్తి.. వీడియో వైరల్!

No escape from meetings even in the desert Man with laptop in Sahara viral video
Advertisement
  • సహారా ఎడారిలో ఒంటెపై ల్యాప్‌టాప్‌తో పనిచేస్తున్న వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌పై పేలుతున్న జోకులు
  • ఎక్కడికి వెళ్లినా మీటింగులు తప్పవంటూ నెటిజన్ల కామెంట్స్
Advertisement
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పనిచేయడం. కానీ, ఓ వ్యక్తి దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఏకంగా సహారా ఎడారిలో ఒంటెపై ప్రయాణిస్తూ ల్యాప్‌టాప్‌తో ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో రిమోట్ వర్క్ కల్చర్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, జోకులతో హోరెత్తిస్తున్నారు.

న్యూయార్క్‌కు చెందిన రీల్ క్రియేటర్ సాద్ అక్తర్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఒంటె మూపురంపై ల్యాప్‌టాప్ పెట్టుకుని సీరియస్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వీడియో తీశారు. "వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మీ స్నేహితుడు" అనే క్యాప్షన్‌ను వీడియోకు జోడించారు. అంతేకాకుండా "మా వాడు సహారా ఎడారి నుంచి మీటింగ్‌లకు అటెండ్ అవుతున్నాడు" అంటూ చమత్కరించారు.

ఈ విచిత్ర దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. 'వర్క్ ఫ్రమ్ ఎనీవేర్'కు ఇదే అసలైన ఉదాహరణ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఫన్నీగా స్పందించారు. ఆఫీస్ మీటింగులు, డెడ్‌లైన్‌ల నుంచి తప్పించుకోవడానికి సహారా ఎడారికి వెళ్లినా లాభం లేదని జోకులు వేస్తున్నారు. దీంతో ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి
Advertisement
Advertisement
Saad Akhtar
Sahara Desert
Work From Home
Viral Video
Remote Work Culture
Camel Ride Laptop

More Telugu News