గతనెల అత్యధికంగా టూవీలర్స్ అమ్ముడైంది ఈ నగరాల్లోనే.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే?
- మేలో ఢిల్లీ తొలి స్థానం
- బెంగళూరు రెండు, హైదరాబాద్ మూడో స్థానం
- బైక్ల మార్కెట్ వాటా 59.4 శాతం
- ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా పెరుగుతోంది
- రాష్ట్రాల్లో యూపీ అగ్రస్థానం
- గ్రామీణ ప్రాంతాల్లో 19.65% వృద్ధి
భారత్లో ద్విచక్ర వాహనాల మార్కెట్ జోరు కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2.14 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదే జోరు కనిపిస్తోంది. మే నెల అమ్మకాల గణాంకాలు చూస్తే దేశవ్యాప్తంగా బైక్లు, స్కూటర్లకు డిమాండ్ బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తాజా గణాంకాల ప్రకారం 2026 మే నెలలో దేశంలో అత్యధిక ద్విచక్ర వాహనాల అమ్మకాలు నమోదైన నగరంగా ఢిల్లీ నిలిచింది. గత నెలలో అక్కడ 46,197 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రెండో స్థానంలో బెంగళూరు 41,717 యూనిట్లతో నిలవగా, హైదరాబాద్ 33,010 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో చెన్నై, పూణె కూడా చోటు దక్కించుకున్నాయి. చెన్నైలో 27,883 ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా, పుణేలో 26,941 యూనిట్లు నమోదయ్యాయి. ముంబై, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, సూరత్ నగరాలు కూడా టాప్-10లో స్థానం సంపాదించాయి.
మే నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల మార్కెట్లో మోటార్సైకిళ్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 59.4 శాతం వాటా బైక్లదే. స్కూటర్ల వాటా 30.2 శాతంగా నమోదైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతూ 8.8 శాతం మార్కెట్ వాటాను సాధించాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్ల వాటా మాత్రం ఇంకా 0.1 శాతానికే పరిమితమైంది.
రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. మే నెలలో అక్కడ సుమారు 3.14 లక్షల ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మహారాష్ట్ర 1.82 లక్షల యూనిట్లతో రెండో స్థానంలో, తమిళనాడు 1.42 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ డిమాండ్ బలంగా ఉన్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
అమ్మకాల సంఖ్య పరంగా మెట్రోయేతర పట్టణాలు ముందంజలో ఉన్నప్పటికీ, వృద్ధి రేటు పరంగా గ్రామీణ ప్రాంతాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. దేశవ్యాప్తంగా మెట్రోయేతర పట్టణాల్లో 11.24 లక్షల ద్విచక్ర వాహనాలు నమోదై 2.82 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 4.85 లక్షల వాహనాలు అమ్ముడై ఏకంగా 19.65 శాతం వృద్ధి నమోదైంది. మెట్రో నగరాల్లో 2.32 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ కావడంతో 6.06 శాతం వృద్ధి కనిపించింది.