అధికారులపై సీఎం రేవంత్ ఫైర్.. అవసరమైతే నేనూ రోడ్లపైకి వస్తా!

Revanth Reddy fires on officials and warns to hit roads if needed for rain relief
  • వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
  • అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం
  • అవసరమైతే తానూ రోడ్లపైకి వస్తానని వెల్లడి
  • నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవాలని ఆయన ఆదేశించారు.

జూన్ 1న నిర్వహించిన సమీక్షలో ముందస్తు సూచనలు జారీ చేసినప్పటికీ, జూన్ 9న కురిసిన వర్షం సమయంలో అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని, శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాలు కురిసే సమయంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండి విధులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. "అవసరమైతే నేనూ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వస్తాను. ట్రాఫిక్ సమస్యలు లేదా వరదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" ఆయన హెచ్చరించారు.

ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఈ సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.                                
Go Back to Shorts
Revanth Reddy
Telangana Rains
GHMC
Hyderabad Traffic
Telangana Weather Update
Disaster Management

More Telugu News