హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

  • జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు
  • ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు
  • జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
హైదరాబాద్‌లో అక్రమ వలసదారులపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీడిమెట్ల ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలోని ఓ అద్దె ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్కడ నివసిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేదా ఇతర అవసరమైన పత్రాలు లేకుండా వీరు ఉంటున్నట్లు గుర్తించారు. 

తదుపరి న్యాయపరమైన చర్యల కోసం వారిని మెదక్ జిల్లా జోగిపేటలో ఉన్న డిపోర్టేషన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారి భారత్ ప్రవేశం, నివాసం, ఇతర వివరాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. బెంగాల్ లోని సువేందు అధికారి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గుర్తింపు–తొలగింపు–దేశ బహిష్కరణ’ (Identify-Remove-Deport) విధానంలో భాగంగా అక్రమ వలసదారులపై చర్యలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా అదే తరహా తనిఖీలు జరగడం గమనార్హం.

Bangladeshi nationals
Hyderabad police
Illegal immigrants arrest
Jeedimetla illegal stay
Jogipet deportation center
Identify Remove Deport policy

More Telugu News