కాంగ్రెస్‌లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు
- మహిళలు, పార్టీ నాయకత్వంపై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో
వైరల్ అయిన ఆడియోలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మహిళలపై కూడా షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అంతర్గత వ్యవహారాలను బహిరంగ చర్చకు తీసుకురావడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.