ఢిల్లీ నుంచి నేరుగా మంగళూరుకు చేరుకున్న సీఎం విజయ్
- ఉడుపి జిల్లాలోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్న విజయ్
- గతంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న ఎంజీఆర్
- విజయ్ రాక నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఆధ్యాత్మిక పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్ సిద్ధమయ్యారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా కర్ణాటకలోని మంగళూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉడుపి జిల్లా పరిధిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొల్లూరు శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు.
దక్షిణ భారతదేశంలో విశేష ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయానికి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆలయాన్ని దర్శించుకోనున్న విజయ్... ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారని సమాచారం.
కొల్లూరు మూకాంబిక ఆలయానికి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో తమిళ రాజకీయాల్లో దిగ్గజ నేతగా గుర్తింపు పొందిన ఎంజీఆర్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి విలువైన ఖడ్గాన్ని కానుకగా అందించారు. నేటికీ ఆ ఖడ్గం ఆలయ సంపదలో భాగంగా భద్రపరచబడుతూ, ప్రత్యేక సందర్భాల్లో భక్తులకు ప్రదర్శించబడుతోంది.
మరోవైపు, విజయ్ పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో కొల్లూరు పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయ్ ఆలయ దర్శనానికి అభిమానులు, పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.