పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందా? ప్రముఖ నటుడి ప్రకటనతో మరోసారి చర్చలోకి..!
- ప్రముఖ నటుడు టైలర్ మేన్‌కు రొమ్ము క్యాన్సర్
- పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అవగాహన
- రొమ్ములో గడ్డ, చనుమొనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
- వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లతో ఈ క్యాన్సర్‌కు చెక్
హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న ఆయన పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అవగాహన కల్పించేందుకు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో ‘‘రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసినప్పుడు మొదట దానిని రహస్యంగా ఉంచాలనిపించింది. కానీ పురుషుల్లో ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తున్నారని తెలుసుకున్నాను’’ అని పేర్కొన్నారు. తనకు వచ్చిన గడ్డను తొలగించాలని భార్య ఒత్తిడి చేయకపోతే వ్యాధి మరింత ఆలస్యంగా బయటపడేదని ఆయన తెలిపారు.
సాధారణంగా రొమ్ము క్యాన్సర్ అంటే మహిళలకే వస్తుందనే భావన ఉంటుంది. అయితే పురుషుల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. యూకేకు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ప్రకారం ఈ క్యాన్సర్ కేసుల్లో 1 శాతం కంటే తక్కువ మాత్రమే పురుషుల్లో నమోదవుతాయి. అయినప్పటికీ ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గమనించాల్సిన లక్షణాలు
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
వయసు పెరగడం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం, జన్యు మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం, కాలేయ వ్యాధులు, ఛాతీ భాగానికి గతంలో రేడియేషన్ చికిత్స తీసుకోవడం వంటి అంశాలు ప్రమాదాన్ని పెంచుతాయి.
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తాగొద్దు. కుటుంబంలో ఆరోగ్య సమస్యల గురించి అవగాహన ఉండాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి. ఛాతీ భాగంలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- రొమ్ము భాగంలో గడ్డ లేదా వాపు
- రొమ్ము కణజాలం మందంగా మారడం
- చర్మం ఎర్రబడటం లేదా గుంటలు పడినట్లు కనిపించడం
- చనుమొన నొప్పి లేదా సున్నితత్వం
- చనుమొన లోపలికి ముడుచుకుపోవడం
- చనుమొన నుంచి రక్తం లేదా ద్రవం కారడం
- చంక కింద లింఫ్ నోడ్స్ వాపు