బాస్ అంటే ఇలా ఉండాలి... సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్
- బైక్ యాక్సిడెంట్లో గాయపడినా ఆఫీస్‌కు వస్తానని చెప్పిన ఉద్యోగి
- పని కంటే ఆరోగ్యమే ముఖ్యం, వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించిన బాస్
- బాస్ తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు, వైరల్ అయిన పోస్ట్
ప్రమాదంలో గాయపడినప్పటికీ విధులకు హాజరవుతానని చెప్పిన ఓ ఉద్యోగికి, సదరు యజమాని ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు అందుకుంటోంది. పని కంటే ఉద్యోగి ఆరోగ్యానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఆ మహిళా బాస్ తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఒక సంస్థలో గత మూడేళ్లుగా పర్మనెంట్ కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల బైక్‌పై నుంచి కిందపడి గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతను తన బాస్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. తనకు నొప్పిగా ఉందని, ఒకవేళ ఉదయానికి తగ్గితే విధులకు వస్తానని, లేనిపక్షంలో తన బదులుగా మరో సహోద్యోగి వస్తారని సందేశం పంపాడు.
దీనిపై ఆ సంస్థ ఫౌండర్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఉద్యోగి అభ్యర్థనను తిరస్కరిస్తూ, "ముందు విశ్రాంతి తీసుకో. ఆస్పత్రికి వెళ్లావా? నీకు గాయం ఏమైనా అయ్యిందేమో" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నొప్పి తగ్గడానికి పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నానని, మధ్యాహ్నం కల్లా ఆఫీస్‌కు వస్తానని ఉద్యోగి చెప్పగా, ఆమె మరింత గట్టిగా వారించారు. "ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల కోసమే నేను హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకో" అని సూచించారు.
ఈ వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను 'థ్రెడ్స్' యాప్‌లో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పని ఒత్తిడి విపరీతంగా ఉండే ఈ రోజుల్లో, ఉద్యోగి ఆరోగ్యం పట్ల ఇంతటి శ్రద్ధ చూపిన బాస్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగికి సంస్థపై ఉన్న నిబద్ధత అభినందనీయమైనప్పటికీ, యజమాని చూపిన చొరవ మరింత స్ఫూర్తిదాయకమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.