జోరు వానను లెక్కచేయని రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ
- హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
- పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా శక్తి సభ
- వర్షంలో తడుస్తూనే వేదికపైకి సీఎం రేవంత్, మంత్రులు
- మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ
- స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేత
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యక్రమాలను కొనసాగించారు. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 'మహిళా శక్తి' మహాసభలో ఆయన పాల్గొన్నారు. కుండపోత వర్షంలోనూ తన సహచర మంత్రులతో కలిసి వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి, మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేటాయించిన 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు.
సభ జరుగుతున్న సమయంలో నగరంలో భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన హైర్ ఛార్జీల చెక్కులను పంపిణీ చేశారు.
'ఇందిరా మహిళా శక్తి' వంటి వినూత్న పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకంలో భాగంగా మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీఎస్ఆర్టీసీ) లీజు ప్రాతిపదికన అందజేస్తారు.