మోడ్రన్ డేటింగ్‌లో కొత్త ట్రెండ్ ‘పఫర్ ఫిషింగ్’.. ఏంటిది?

Lifestyle
Advertisement
  • రిలేషన్‌షిప్‌ సీరియస్ కాగానే దూరమయ్యే వింత ప్రవర్తన
  • పఫర్ చేప రక్షణ వలయంలా ప్రవర్తిస్తారు
  • చిన్ననాటి భయాలే ఇందుకు ప్రధాన కారణం
  • చర్చల నుంచి తప్పించుకునేందుకు ఘోస్టింగ్ ఆశ్రయం
  • థెరపీ ద్వారా మార్పు సాధ్యమని వెల్లడి
Advertisement
మారుతున్న కాలంతో పాటు మోడ్రన్ డేటింగ్ ప్రపంచంలో రోజుకో కొత్త పదం పుట్టుకొస్తోంది. ‘ఘోస్టింగ్’, ‘బ్రెడ్‌క్రంబింగ్’ లాంటి పదాలను మరిచిపోకముందే 2026లో ‘పఫర్ ఫిషింగ్’ అనే సరికొత్త డేటింగ్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పదం వినడానికి చేప పేరులా ఉంది కదా? మరి దీనికీ, డేటింగ్‌కు సంబంధం ఏంటో చూద్దాం..

ఏంటీ ‘పఫర్ ఫిషింగ్’?
డేటింగ్‌లో భాగస్వామి ప్రవర్తించే ఒక వింత ధోరణిని సూచించడానికి మానసిక నిపుణులు ఈ పేరు పెట్టారు. సాధారణంగా ‘పఫర్ ఫిష్’ అనే చేప తనకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపించినప్పుడు.. తనను తాను రక్షించుకోవడానికి శరీరాన్ని ఒక ముళ్ల బంతిలా మార్చుకుని, దూరంగా జరుగుతుంది. డేటింగ్‌లో కూడా కొందరు వ్యక్తులు సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్నప్పుడు, విషయం పెళ్లి లేదా ‘సీరియస్ రిలేషన్‌షిప్’ వైపు వెళ్తున్నప్పుడు.. వారు ఒక్కసారిగా మానసికంగా దూరమవ్వడం లేదా ఎలాంటి కారణం లేకుండా బ్రేకప్ చెప్పి పారిపోవడాన్ని ‘పఫర్ ఫిషింగ్’ అంటారు.

ఈ లక్షణాలు ఉంటే..
  • బంధం మొదలైన కొత్తలో వీరు ఎంతో కేరింగ్‌గా, అమితమైన ప్రేమను కురిపిస్తూ ప్రాణమిచ్చేలా నటిస్తారు.
  • ఎప్పుడైతే బంధం క్యాజువల్ కెమిస్ట్రీ నుంచి నిజమైన ఎమోషనల్ బాండింగ్ వైపు మళ్లుతుందో.. అప్పుడు వారిలో భయం మొదలవుతుంది. ఒక క్షణం దగ్గరగా ఉంటూనే, మరుసటి క్షణమే ఊపిరాడనంతగా ఫీలవుతూ దూరంగా జరిగిపోతారు.
  • రిలేషన్ సీరియస్ అవుతున్న కొద్దీ భాగస్వామిలోని చిన్న లోపాలను పెద్దవిగా చేస్తూ గొడవలు పడటం స్టార్ట్ చేస్తారు. కఠినమైన లేదా నిజాయతీతో కూడిన సంభాషణలు వస్తే చాలు.. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారు.
  • చెప్పాపెట్టకుండా ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి మాయమైపోతారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత ఏమీ తెలియనట్టు వచ్చి పాత బంధాన్ని అక్కడి నుంచే కొనసాగించాలని చూస్తారు.

ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు?
రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్నతనంలో వారి కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం లేదా గతంలో ప్రేమ పేరుతో మోసపోవడం వల్ల వీరు ఇలా తయారవుతారు. బంధంలో లోతు పెరిగితే అవతలి వారు ఎక్కడ తమను కంట్రోల్ చేస్తారోనని లేదా మళ్లీ ఎక్కడ మోసపోతామోననే భయం వారిని వెంటాడుతుంది. అయితే స్పేస్ కోరుకునే ప్రతి ఒక్కరూ పఫర్ ఫిష్ కాదని, సరైన కమ్యూనికేషన్ లేకుండా తరచూ పారిపోయే వారిని మాత్రమే ఈ కేటగిరీలోకి చేర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. థెరపీ, స్వీయ అవగాహన ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని సూచిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Puffer FishingModern Dating TrendsRelationship PsychologyCommitment PhobiaDating Red FlagsSocial Media Trends

More Telugu News

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30

ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లాంకు విరుద్ధమన్న మత పెద్దలు

02 Nov, 17:14

షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే: నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం

02 Nov, 17:10

హైదరాబాద్‌ మెట్రోకు నిధుల జోరు.. ఫేజ్‌-2కు రూ.150 కోట్లు

02 Nov, 17:00

ప్రతి మండలంలో కూటమి జెండాలు రెపరెపలాడాలి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం

02 Nov, 16:53

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39

అసలు వీటిని ఎన్నికలంటారా?: రవీంద్రనాథ్ రెడ్డి

02 Nov, 16:35

దిగ్గజ జట్లకు షాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ సంచలనం

02 Nov, 16:17

రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్

02 Nov, 16:14

ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం: జగన్

02 Nov, 16:14
..More Telugu News