సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్!
- శక్తిమంతమైన సిరి ఏఐ, ఐవోఎస్ 27 ఆవిష్కరణ
- జెమిని సాంకేతికతతో సహజ సంభాషణలు
- స్క్రీన్ సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం
- ఐఫోన్ 11 మోడళ్లకు ఐవోఎస్ 27 సపోర్ట్
- యూజర్ల ప్రైవసీకి యాపిల్ అగ్రతాంబూలం
యాపిల్ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2026) వేదికగా ఐఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఐవోఎస్ 27 (iOS 27) సాఫ్ట్‌వేర్‌తో పాటు, అత్యాధునిక కృత్రిమ మేధస్సుతో పనిచేసే 'సిరి ఏఐ' (Siri AI)ని సంస్థ ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పూర్తిస్థాయిలో రీబిల్ట్ చేసిన ఈ వాయిస్ అసిస్టెంట్‌ను ప్రధాన ఆకర్షణగా నిలిపారు. వినియోగదారుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, డివైస్ లోపలే డేటా ప్రాసెస్ అయ్యేలా (On-Device Processing) యాపిల్ దీనిని డిజైన్ చేసింది.
గూగుల్ జెమిని (Google Gemini) సాంకేతికత, నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ సాయంతో రూపొందిన ఈ 'సిరి ఏఐ'.. ఇకపై మనుషుల తరహాలోనే సహజంగా సంభాషించగలదు. మెసేజ్, మ్యాప్స్ వంటి యాప్స్ ద్వారా యూజర్ల వ్యక్తిగత అవసరాలను ఇది సులభంగా అర్థం చేసుకుంటుంది. అంతేకాకుండా, స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని గ్రహించి ఈమెయిల్‌లు, టెక్స్ట్‌లు లేదా డాక్యుమెంట్లను ఎడిట్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా హిస్టరీని చూసుకునేలా ఒక స్టాండ్‌అలోన్ యాప్‌ను, డైనమిక్ ఐలాండ్ ఇంటిగ్రేషన్‌ను యాపిల్ జోడించింది.
ఐవోఎస్ 27 అప్‌డేట్ ద్వారా అడ్వాన్స్‌డ్ ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ సరికొత్త ఓఎస్ ఐఫోన్ 11, ఆపై మోడళ్లకు సపోర్ట్ చేస్తున్నప్పటికీ, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు మాత్రం ఐఫోన్ 16 సిరీస్ లేదా ఎమ్-సిరీస్ (M-series) చిప్స్ ఉన్న డివైజ్‌లలో మాత్రమే పనిచేస్తాయి. ఐవోఎస్ 27తో పాటు మ్యాక్ ఓఎస్ 27, వాచ్ ఓఎస్ 27లను కూడా యాపిల్ ప్రకటించింది. ప్రస్తుతం డెవలపర్ బీటా వెర్షన్ అందుబాటులో ఉండగా, ఈ ఏడాది చివర్లో యూజర్లందరికీ ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్లో ఈ అప్‌డేట్స్ లభించనున్నాయి.