ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...!
- ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న
- ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్
- ఇటీవల రష్మికపై సీక్రెట్ గా లుక్ టెస్ట్ నిర్వహించిన చిత్రబృందం!
- గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలన
ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం, ఇటీవల చిత్రబృందం రష్మికపై రహస్యంగా ఒక లుక్ టెస్ట్ నిర్వహించింది. సాంప్రదాయ గెటప్‌లో రష్మిక అద్భుతంగా సరిపోయిందని, ఆమె హావభావాలు చూసి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ పాత్రకు ఆమెను దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నిజానికి ఈ బయోపిక్ ప్రకటించినప్పటి నుంచి కథానాయికగా పలువురి పేర్లు వినిపించాయి. మొదట సాయి పల్లవి, ఆ తర్వాత కన్నడ నటి రుక్మిణి వసంత్ పేర్లను పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. అయితే, తాజా పరిణామాలతో వారందరినీ వెనక్కి నెట్టి రష్మిక ఈ అవకాశాన్ని దక్కించుకున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక కెరీర్లో ఈ బయోపిక్ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.