ఇది ఇడ్లీ... ఐటీ ఇంజినీర్ కు శశి థరూర్ క్లాస్!

  • ఇడ్లీని పిజ్జాలా కట్ చేసిన ఫొటోపై శశిథరూర్ స్పందన
  • ఇది ఇడ్లీ, 'ఇడ్-స్లైస్' కాదంటూ చమత్కార వ్యాఖ్య
  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటగదిలోకి వెళిటే ఇలాగే ఉంటుందని సెటైర్
  • గతంలోనూ ఇడ్లీ గొప్పతనాన్ని వర్ణించిన కాంగ్రెస్ నేత
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న శశిథరూర్ పోస్ట్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో మరోసారి సామాజిక మాధ్యమాల్లో సందడి చేశారు. దక్షిణాది సంప్రదాయ వంటకం ఇడ్లీని తినే విధానంపై ఆయన చేసిన చమత్కారపూరిత వ్యాఖ్య ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బెంగళూరుకు చెందిన యశ్ రావల్దోసా అనే ప్రొడక్ట్ మేనేజర్, తాను ఇడ్లీలను పిజ్జా ముక్కల్లా కట్ చేసిన ఫొటోను 'ఎక్స్'లో వేదికగా పంచుకున్నారు. తన కటింగ్ నైపుణ్యానికి రేటింగ్ ఇవ్వాలని ఆయన నెటిజన్లను కోరారు. ఈ పోస్ట్‌పై శశిథరూర్ వెంటనే స్పందిస్తూ, సాంకేతికతను, వంటను ముడిపెడుతూ సరదాగా సమాధానమిచ్చారు.

"ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటగదిలోకి వెళ్లి డేటాను విభజించడానికి ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుంది! దాన్ని 'ఇడ్లీ' అంటారు, 'ఇడ్-స్లైస్' కాదు. ఒకవేళ వారు ఇటాలియన్లు అయ్యుండి, దాన్ని పిజ్జా అని పొరబడితే తప్ప.. ఇడ్లీలను ఇలా ఎవరూ తినరు. (అయితే పిజ్జాపై సాంబార్ వేయడానికి మాత్రం ప్రయత్నించకండి, సరేనా?)" అంటూ థరూర్ పోస్ట్ చేశారు.

ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఇడ్లీలను ఆవిరిపై ఉడికించి సాంబార్, చట్నీతో కలిపి తినడమే సరైన పద్ధతి అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. గతంలో ఇడ్లీని ఎవరో రసగుల్లాతో పోల్చినప్పుడు కూడా శశిథరూర్ ఇలాగే స్పందించారు. ఆ సమయంలో ఆయన ఇడ్లీని "వంటల ప్రపంచంలోని గొప్ప ఇంజినీరింగ్ అద్భుతాలలో ఒకటి" అని వర్ణించారు. సామాజిక, సాంస్కృతిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే థరూర్, ఈ పోస్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

Shashi Tharoor
Idli Pizza Viral
Yash Ravaldosa
South Indian Cuisine
X Social Media

More Telugu News